Home సూర్యాపేట అవినీతికి అడ్డాగా భూ రికార్డుల ప్రక్షాళన

అవినీతికి అడ్డాగా భూ రికార్డుల ప్రక్షాళన

So Many Farmers Not Taking PassBooks In Suryapet

మన తెలంగాణ/సూర్యాపేట : రైతుల వ్యవసా యా నికి సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అనేక రకాలుగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రై తులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 8 వేల రూపాయలు మొ త్త ంగా, మొదటి విడతగా ఎకరాకు నాలుగు వేల రూపా యల చొప్పున ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తా త, ముత్తాతల కాలం నుండి అనుభవి స్తున్న, కాస్తులో ఉన్న, పట్టా కలిగి ఉన్న భూములకు సైతం రైతు బంధు చెక్కులు రాలేదు. రెవెన్యూ అధికారులు, విఆర్ ఓల పుణ్యమా అని రైతులు తమ సొంత భూమికి కూడా నగదు, పాస్‌బుక్‌లు రాక అనేక ఇబ్బందులు పడు తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఒప్పు లను సవరిం చడా నికి ధరణి వెబ్ సైట్‌ను ప్రారం భించింది.

ప్రభుత్వ భూ రికార్డుల్లో నమోదు కానీ వారు, కం ప్యూ టర్ ద్వారా పహాణీలు, 1బీలు తప్పులు ఉన్న వారు, అన్నద మ్ముల వాటాలు పంచుకొని భూమి ఎవరి పే రున వారికి రాని వారు, ఇతరుల నుండి భూమిని కొను గోలు చేసి రికార్డులకు ఎక్కించు కొని వారు ధరణి వెబ్ సైట్ ద్వారా తప్పుఒప్పులను సవరిం చుకునే వీలును క ల్పించారు. ఇదే అదునుగా గ్రామ స్థాయిలో విఆర్‌ఓలు పైసలు లేనిదే పని చేయ డం లేదనే ఆరోపణ లు న్నాయి.తమ దగ్గదరికి వచ్చిన అమాయక, అక్షరా స్యత లేని రైతులను టార్గెట్ చేసి కా సులు కురిపిస్తేనే పనులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నా యి. అసలే వ్యవ సాయ సీజన్ ప్రారంభమై ఉన్న నేపథ్యంలో రెవె న్యూ అధికారుల చుట్టూ తిరగలేక, అడిగినన్ని డబ్బులు ఇచ్చుకోలేక రైతన్నలు అష్టకష్టాలు

అవినీతికి అడ్డాగా భూ రికార్డుల ప్రక్షాళన
పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెవిన్యూ అధికారుల అవినీతిపై మనతెలంగాణ సమగ్ర కథనం. చిన్న రై తులు కూడా ఈ భారీనపడ్డారు. ప్రభుత్వ ప్రకటన వె లువడ్డ అనంతరం రైతాంగంలో ఆనందం వెల్లివెరి సి ంది. ఆ ఆనందం ఎన్నో రోజులు నిలబడలేక పోయి ంది. గ్రామాల్లో రైతులకు
పాస్‌బుక్‌లు ఉన్నా భూమిలేదు. భూమి ఉన్న వారికి పాస్‌బుక్‌లు లేని పరిస్థితి. రెవిన్యూ అధికారులు ఇండ్ల చుట్టూ తిరుగుతూ తమ భూములను సమగ్రంగా రికార్డులను తయారు చేసి పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ప్రాదేయపడుతున్నారు. ఆయకట్టు ప్రాంతంలో విఆర్‌ఓ, చోట యోటా నాయకులు రైతులను పీడిస్తున్నప్పటికీ పై స్థాయి అధికారులు తూతూ మంత్రంగా విఆర్‌ఓలపై చర్యలు తీసుకుంటున్నారు. పై స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని పరిస్థితి ఒక్కో మండలంలో పెద్ద సార్, మధ్యసార్, చిన్న సార్‌లు కలిసి రైతుల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయకట్టు ప్రాంతాలైన నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, చిలుకూరు, కోదాడ పాలకీడులతో పాటు పలు మండలాల్లో వసూలు రాజాలు కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిసి భూ రికార్డులను సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో రెవిన్యూ ఉన్నతాధికారులు స్పందించి గ్రామ స్థాయిలో జరుగుతున్న అవినీతికి చెక్ పెట్టి విఆర్‌ఓల ద్వారా త్వరగా పని చేయించి రైతులకు ఇబ్బందులు చూడాల్సిన అవసరం ఉంది.