Home ఆదిలాబాద్ తప్పెవరిది ?

తప్పెవరిది ?

జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్లు
గర్భిణులు నొప్పులు తట్టుకోలేకపోతున్నారని చెబుతున్న వైద్యులు
కాసుల కోసమే చేసేస్తున్నారంటున్న బాధితులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నా కాన రాని మార్పు

Pregnant

ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి: మొదటి కాన్పు సాధారణ ప్రసవమైతే.. రెండో కాన్పులో శస్త్రచికిత్స అం టారేమిటి?.. ఇది విజయనగరం పట్టణానికి చెందిన ఓ గర్భిణి ప్రశ్న. జిల్లాలో చాలా మంది తల్లులకు గర్భిణీ సమయంలో కడుపు కోత తప్ప డం లేదు. కాన్పుల విషయంలో వ్యవహరిస్తున్న వైద్య విధానంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. అవసరం ఉన్నా లేకున్నా కూడా కోత పెట్టడం మం చి పద్ధతి కాదని, ఈ విధానంతో దుష్ప్రభావం తల్ల్లిబిడ్డా ఇద్దరిపైనా పడుతు ందని హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ హెచ్చరికలు ఆసుపత్రుల నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. డబ్బుల కోసమే అలా చేస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరి యన్‌కు వెళ్లాల్సి వస్తుందని వైద్యులు వాదిస్తున్నారు.

ఎలాంటి పరిస్థితిలో చేస్తారు?
గర్భిణికి కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే అలాంటప్పుడు సిజేరియన్ వైపు వైద్యులు మొగ్గుచూపే అవకాశాలు ఉంటాయి. ఆ పరిస్థితులు ఇలా ఉండోచ్చు.
పోట్టిగా 145 సెంటిమీటర్ల కంటే తక్కువ ఉన్నవారు
రక్తహీనత 8 గ్రాముల కంటే తక్కువగా ఉన్నవారు
మధుమేహం, రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి
రెండు, మూడు అబార్షన్లు జరిగిన వారికి
గుండెవ్యాధులు ఉన్నవారికి
గర్భిణులకు స్కానింగ్ చేసి కవలలు ఉన్నట్లు గుర్తించిన వారికి
ఉమ్మినీరు తక్కువగా ఉన్నవారు
18 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాలు దాటి గర్భం దాల్చిన వారు
మూడు, ఆరునెలల గర్భం నుంచి రక్తస్రావం జరిగిన వారికి
మేనరిక వివాహాలు చేసిన వారికి

కలిగే అనర్థాలు
సిజేరియన్ చేయించుకోవడం వల్ల మహిళలు నడుము, తలనోప్పి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య సిబ్బందే చెబుతున్నారు. మొదటిసారి సిజేరియన్ అయితే రెండో సారి కూడా చేయాల్సి ఉంటుంది. సిజేరియన్ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. ఒక్కో సమయంలో రక్తం ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంటుంది. రక్త స్రావం తగ్గకపోతే గర్భ సంచి తీసే ప్రమాదం కూడా ఉంది.

ఇవీ అపోహలు
మందులు ఎక్కువగా వాడితే అండంలో బిడ్డపెరిగి శస్త్రచికిత్స చేస్తారనే అపోహ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే ఇరన్, కాల్షియం మందులు సక్రమంగా పనిచేయవని అపోహ
చేయాల్సిన పరీక్షలు
గర్భిణులకు బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై స్కానింగ్ చేయించాలి
హెచ్.బి./ఎ.జి., బి.డి.ఆర్.ఎల్., హెచ్.ఐ.వి., రక్తంలో మధేమేహం ఎంతశాతం ఉందో తెలిపే పరీక్షను నిర్వహించాలి

వైద్యుల సలహాలు
కాలానుగుణంగా దొరికే పండ్లు తినాలి
ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి
వైద్యులు ఇచ్చిన మందులను సూచనలు, సలహాలను పాటించాలి ఉండాల్సిన విటమిన్లు
గర్భిణులకు ప్రతిరోజు 2200 నుంచి 2500 కేలరీస్ ఆహారం ఉండాలి.
ప్రోటీన్స్ 60 గ్రాములు
కాల్సియం 1000 మిల్లీగ్రాములు
విటమిన్‌సి 30 మిల్లీగ్రాములు
విటమిన్‌ఎ 750 మైక్రోగ్రామ్స్
పోలిక్ యాసిడ్ 400 గ్రాములు

ప్రైవేట్
జిల్లా వ్యాప్తంగా ప్రసవాలు జరిపించే ప్రైవేట్ ఆసుపత్రులు 20 వరకు ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో 23971 ప్రసవాలు జరగ్గా ఇందులో సాధారణ ప్రసవాలు 16847, మిగిత సిజేరియన్లు ఉన్నాయి. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు 10 వరకు ఉన్నాయి. 2015-16లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,079 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 7472 కాగా 2607 సిజేరియన్లు ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీజేరియన్లు సంఖ్య కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు. సాధారణ ప్రసవాలకే పాధాన్యమివ్వాలని కచ్చితంగా మౌలికమైన ఆదేశాలున్నాయి. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చిందో వైద్యులు వివరణ ఇచ్చుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రజల్లోనూ ఆలోచనా విధానం మారాలి.”