Home ఎడిటోరియల్ ఈనాటి కవయిత్రుల్లో సామాజికత

ఈనాటి కవయిత్రుల్లో సామాజికత

  • ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

women-power

అత్యాధునిక, వైజ్ఞానిక ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపో తున్న ఈ నవ నాగరిక లోకంలో ఇంటర్నెట్ అంత గగ్గోలు పెడుతూ ఆడవాళ్ళపక్షాన మాట్లాడడం కొ న్ని మెదళ్ళనైనా కదిలించకపోదు. కుళ్ళుజోకులు, వెధవకబుర్లు పంటికింది రాళ్ళలా వస్తున్నా, మౌనముద్రతోనూ, నిరాసక్తతతోనూ కవులూ, కవయిత్రులూ కాలం గడుపుతున్నారు. నలభై దశాబ్దాలపైగా తిష్టవేసుకున్న నల్లని డబ్బా బుల్లితెరతో ఇళ్లల్లో పలికిస్తున్నది. విజ్ఞాన వినోదదాయినిగా ఓ ముప్పైఏళ్ళు పనిచేసినా మరీ ఒక దశాబ్దకాలంగా జుగుప్సాకర సన్నివేశాలతో, స్త్రీలంటే చులకన భావంతో దయ్యాలు, భూతప్రేత పిశాచాలుగా చూపుతున్నా, ఆడబాసులు దౌర్జన్యాల నుండి లేడీ విలన్లుగా ఎదిగినట్టు చూపుతూ వరుస కథనాల నల్లుతున్నా కళ్ళున్న కబోధులుగా చేస్తున్నా కిమ్మనకుండా ఉండే దుస్థితిని ఏ ఒక్క కులం నిలదీయలేకపోతున్నది. ‘పిండిబొమ్మ’ అనే కవితలో “వెండితెరపై ఆందాలవిందు చేయ ఉడుపులన్న ముడుపుగట్టే సుందరీమణులలోని చీమూనెత్తుర్లు కన్నవారితో కల్సి దుఃఖిస్తూ, తోబుట్టువులతో చర్చిస్తుంటే పిల్లాపాపలసలే కలగద్దని స్త్రీ జాతి నిరసిస్తుంది.” అని నీహారిణి రాసింది. ప్రేమతత్వపు స్థిరరూపమై, గుండె ధైర్యానికి మచ్చుతునకై, శ్రమశక్తికి ప్రతీకయై మనగలిగే స్త్రీ జాతిపై గౌరవంతో ఎందరో కవులు రచనలు చేసిన దాఖలాలున్నవి.
A house is made up of bricks, but a home is build with heart. ఒక ఇల్లును ఇటుకలతో కట్టవచ్చుగాని, ఒక గృహాన్ని హృదయంతో మాత్రమే నిర్మించగలము. ఇల్లు బాహ్యరూపం. ఇక గృహం అంటే ఇంటిగా మలిచింది. ఇంటి లో ఉండేవారు మనుషులు. మనుషులకు మాత్రమే మనసుం టుంది. ఇంటికీ, ఇంతికీ అవినాభావ సంబంధం. మట్టికీ మనిషికీ ఉన్నంతటి బంధం. మనిషి వర్థిల్లడానికి కుటుంబ మెంత ముఖ్యమో మహిళ ప్రవర్థిల్లడానికి ఆమె సంక్షేమం, అభివృద్ధి, సాధికారిత అంత ముఖ్యం. అభ్యుదయ సమన్విత మైన ఈ మూడు అంశాలు పరిణాత్మకంగానే కాదు, గుణాత్మ కమైన మార్పులు కాలాననుసరిస్తూ సాగాలి. దాదాపు 2500 ఏళ్ళ నుండి భాష బ్రతుకు ఆనవాళ్ళు దొరికితే, దాదాపు 500 ఏళ్ళ సాహిత్య అవతరణ కాలం అని అనుకుం టే వేల ఏళ్ళ కాలనుండి పందొమ్మిది వందల అరవైదశక కాలం వరకు వేళ్ళ మీద లెక్క బెట్టే కవయిత్రులే ఉన్నారు. కాని నిరక్షరాస్యుల మనోత్తేజాల మాటల వరదల్లో, చమట చుక్కల చందనాల సుగంధాల పరిమళాల్లో మనకు దొరకని పాటలు ఎన్నో , అక్షరీకించక పుస్తకీకరించక మరుగున పడిన మాణిక్యాలెన్నో!! పెండ్లి పేరంటాల పాటలు, పండగపబ్బాల పాటలలో అభ్యుదయాన్ని సందర్శిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మౌఖిక సాహిత్యం గొప్ప తనాన్ని అనుభవిం చడానికి నేటికీ ఊళ్ళన్నీ పాడుతున్న “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మా ఉయ్యాలో” వంటి పాటల స్థానాన్నే బతుకు అమ్మగా కొత్త పాటలు చేరినవి. ‘కడుపులో బిడ్డ ఆడపిల్ల అని స్కానింగ్‌ల ద్వారా దొంగచాటుగా, అవినీతి మార్గంలో ( పభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా!) తెలుసుకొని చంపేస్తున్న ఈ పాడులోకం రీతిని నిరసిస్తూ “ ఉమ్మ నీటిలోన ఉయ్యాలో/ చిమ్మచీకటుంది ఉయ్యాలో/ వెలుగుల లోకాన్ని ఉయ్యాలో/ సూడబుద్దవుతుంది ఉయ్యాలో (స్ఫూర్తి) అని వ్రాయడమైనా, ఆడపిల్లలనీ బ్రతుకనిస్తే/ అమ్మనై మళ్ళి జన్మనిస్త (కె. భాస్కర్); వ్రాయడమైనా ఏ ఇంటివారు ఆ ఇంట్లో మా ఇంటి బతుకమ్మ’ గా భావిస్తే ” చదువి నంతా నిన్ను ఉయ్యాలో చదివిస్తామమ్మ ఉయ్యాలో /స్వేచ్ఛగా బతికేల ఉయ్యాలో/ హక్కులే అడిగేల ఉయ్యాలో/ వీరనారి లాగ ఉయ్యాలో/ నిను పెంచు తామె తల్లి ఉయ్యాలో / బతుకమ్మ సాక్షిగా ఉయ్యా లో బతుకుతావే నువ్వు ఉయ్యాలో (అనిత) అని వ్రాసినా; ఇంట్లోంచి చదువులకో, ఉద్యోగాలకో బయల్దేరిన అమ్మాయిల్ని వేధించే వారిని నిరసిస్తూ హత్యలు చేయడాన్ని ఖండిస్తూ “ దేశ రాజధాని వలలో / కవ్వింపు మాటలతో వలలో/ బస్సులో బుసగొట్టె వలలో/ యమపాశమయ్యే వలలో ” ( ఉరిమిళ్ల సునంద) అంటూ వ్రాసినా స్త్రీ వాద ధోరణి తో వ్రాసినవే. ఇలాంటి కవిత్వమే రావాల్సి ఉన్నది.
అమాయక వంటింటి కుందేలు నుండి ఆరింద వంటింటి కుందేళ్ళుగా కూపస్థమండూకం నుండి కొలనులో మండూకాల పరిస్థితులు వచ్చినా, ఇంకా ‘అసమానత’ అనే పంజరం నుండి బయటపడలే దు. 1948లో మానవహక్కుల ప్రకటన చేసి, ప్రాథ మిక హక్కులు అందుబాటులోకి తేవాలని సంకల్పించినా, ఇవన్నీ నైతిక హక్కుల కోసం ఉటంకించడమేగాని, స్త్రీల స్వాభిమానం కోసం నిలబడడం లేదు.. రాతల్లోగానీ, చేతల్లోగానీ “దేవుడేలేడనే మనిషున్నాడు. అమ్మే లేదనువాడు అసలేలేడు” వంటి భావాలు అందరిలో కలగాలి. స్త్రీలకు 1. ఆర్థిక స్వాతంత్య్రం 2. ఆత్మగౌరవం 3. ఎంపిక చేసుకునే హక్కు అనే విషయాల దృష్టా చూస్తే పితృస్వామిక కౌటుంబిక భావజాలంతో గమనిస్తే అందని ఆకాశం లాగే ఆమె బ్రతుకు బాటయ్యింది. 1955లో వచ్చిన వివాహ చట్టమైనా, 1957 లో వచ్చిన వరకట్న నిషేద చట్టమైనా విలోమభావాన్ని ప్రజల్లోకి పంపిన వేగాని నిజానికి స్త్రీ పక్షం నిలవడం లేదు. 1. జీవించేహక్కు 3. రక్షణ హక్కు 3. పాల్గొనే హక్కు అనేవి సమపాళ్ళల్లో అందితే గర్భస్త శిశువునే కాల రాసే పరిస్థితులెందుకొస్తాయి. స్త్రీ జీవితంతో అల్లుకోబడిన కుటుంబం, సమాజం వివక్షను వీడాలని కవితలు, కథలు , నవలలుగా రూపాలు కూర్చిన కవయిత్రులు, రచయిత్రులు మహిళల పక్షాన్నే కాదు తెలుగు సాహిత్యం పక్షానా నిలిచారు. నాలుగు పాళ్ళెక్కువ చాతుర్యం కలిగున్నా1. ఆర్థిక 2. విద్య, 3.సమానత్వ 4. సాధారణ హక్కులు అనే నాలుగు విధాలు సులువుగా పొందడం లేదనీ జాతి వివక్ష లింగ వివక్షలతో పాటు ప్రాంతీయ వివక్ష కూడా గురి అవడాన్ని తమ కవితల్లో ప్రస్పుటించారు. తాగుకు బానిసయ్యి అష్టకష్టాల పాలు చేస్తున్న వైనం ఏనాటిదో!
“పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్ళి చేస్తానని/ పంతులు గారన్నప్పుడే భయం వేసింది. ఆఫీసులో నా మొగుడున్నా డు/ అవసరమున్నా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది/ పెళ్ళంటే పెద్దశిక్షని, మొగుడంటే స్వే చ్ఛాభక్షకుడని” అంటూ కవయిత్రి సావిత్రి వ్రాసిన తీరు లోని తీవ్రత ఇప్పటికీ అవసరమనిపించే సమాజాన్నే చూస్తు న్నాం. కాలమెంత మారినా ఈస్పీడ్ యుగంలో బ్రేకులే లేనట్లున్నా తిండి ,అన్న అలసట, నిద్ర వంటి అవసరాల్లో ఏమంత మార్పు రాలేదని అందరికీ తెలుసు. విమల తన కవి తలో “ఈ వంటిల్లొక వదలని మోహమై/ నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది.” అని వివక్షను బట్టబయలుచేసింది. అలెగ్జాం డ్రా కొల్లెంటై, బ్రౌన్‌స్టెల్లా వంటి పాశ్చాత్యులు, బెబెల్ ఆగస్టు ‘వుమెన్ అండ్ సోషలిజం’ పుస్తక ప్రభావంతో సోషలిస్టు ఫెమి నిస్టు ధోరణిని ఆలంభన చేసుకొని స్త్రీలు పునరుత్పత్తి కేంద్రా లన్న భావనను పోగొట్టాలని పోరాటాలు చేశారు. యాజమా న్యాలలో భాగస్వాములను చేయక పోవడం, కర్మాగారాల్లో శ్రామిక శక్తిని తగినంత చెల్లించకపోవడం, రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ నివ్వకపోవడం వంటివన్నీ మహిళలు గళాలెత్త చేస్తున్న వి. ఇంటిపని, వంటపనికి మాత్రమే అంకితం చేసే విపరీత ధోరణి , యాంత్రికత భావం కొంత తగ్గినా, సంపూర్ణ అక్షరా స్యతను సాధించే దిశలో పయనిస్తున్నా ఇంకా ఆడపిల్లలకు తగిన స్వేచ్ఛ లేక పోవడం, సమానత్వాన్ని చూపకపోవడం, సామాజిక న్యాయం జరగకపోవడం గమనిస్తున్నాం. వీట న్నింటినీ మించి నిత్యం జరిగే పాశవిక కృత్యాలు మనసును కలచివేస్తుంటే నిండు యవ్వన మకరందాలు గుండెల్లో దాచుకొని/ దోచునివ్వకుండా కాపాడుకుంటూ/ గండు తుమ్మెదల వేధింపులు/ ఓర్పుతో జయిస్తూ / జ్ఞానిగా, విజ్ఞానిగా ప్రపంచానికి తనని పరిచయం చేసుకుంది. ( నీహా రిణి) అంటుందీ కవయిత్రి, “తిరుగుబాటు ప్రకటిస్తున్నా కుటుంబంలోని కుళ్ళుని కడిగి/ సమాజంలోని దుర హంకారాన్ని ఇక ఉతికి ఆరేస్తా”… అంటుంది జాజుల గౌరి. స్త్రీ వాదం ఎక్కడిది? ఎందుకు? అనే ముదిగంటి సుజాతరెడ్డి గారి వ్యాసం ఎన్నో విషయాల్ని అందించారు. ఈనాటి పరిస్థితుల్ని వివరిస్తూ!ఆకాశయానంలో తారాజువ్వలా దూసుకుపోతున్నతరం, అంతరిక్షపు అంతులు తేల్చే నేర్పరి తనం ఈనాటి స్త్రీ జాతిది. చదువుల్లో ఎవరికీ తీసిపో కుండా ఉన్నత శ్రేణుల్లో ఉత్తీర్ణులగుతూ, పోటీ పరీక్షల్లో నెగ్గుతూ కార్యాలయాల్లో తమ నైపుణ్యాల్ని ప్రదర్శిస్తూ అటు ఉద్యోగినిగా, ఇటు తల్లిగా ఉత్తమ పాత్ర పోషిస్తున్న ఆడవాళ్ళ కు వేధింపులు, అనుకోని కష్టాలు ఎదురౌతున్నవి. దశాబ్దాలు గడిచినా స్త్రీవాదంపై గొంతెత్తాల్సిన పరిస్థితులు ఇంక ఉండడాన్ని కవయిత్రులంతా ఎండగట్టాలి. ఆనాడు ఓల్గా, గీతాంజలి, రజని, జయపద్ర, నిర్మల , శిలాలోలిత, స్వాతీ శ్రీపాద, భవాని దేవి వంటి కవయిత్రుల కవితా పంక్తులెన్నో ఉదహరించాల్సి వస్తుందిగాని, కొత్త సమస్యలు చుట్టుకొని సతమతమౌతున్న స్త్రీల పక్షాన బలమైన కవిత్వం రావడం తగ్గిందనే అనుమానం వస్తుంది.
దళిత, మైనారిటీ స్త్రీల పక్షాన నిలబడి, వారిచైతన్యానికి తోడ్పడాల్సిన అవసరం ఉంది. వారి సంస్కృతిలోని ఆ విద్య, బుర్ఖా, తలాఖ్ వంటి గృహహింసను నిరసిస్తూ షాజహానా, షెహజ్ ఫాతిమా, ఇష్రత్‌సుల్తాన వంటి వారు, జూపాక సుభద్ర, జాజులగౌరి, గోగుశ్యామల వంటి కవయిత్రులు గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న గిరిజన వాదం కోసం సూర్యాధనుంజయ్ కృషి చేస్తు న్నా కవిత్వం రూపంలో ఇంకా రావాల్సి ఉన్నది. ఈ మధ్య త్రివేణి బి.సి కవిత్వంలో మహిళను చూపడానికి ప్రయత్నిం చారు. నేత దారప్పోగుల పనితనాల నేతన్నలు, వారితో అక్కల గురించి చెప్పడమైనా, మట్టిపనులు కుండలు మహిళ లేకుండా ఎక్కడౌతున్నాయనీ, పంట పొలాల్లో కలుపు మొక్క లేరే చేతులూ స్త్రీలవేనని తెలయనిదెవరికి?
ఉద్యమాల ద్వారా సాధించుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రం విషయం అని అందరికీ తెలుసు. అని శెట్టి రజిత, తిరునగరి దేవకీదేవి, పోతన జ్యోతి, దాసోజులలిత, శారదా హన్మాండ్లు , శ్యామల, సుజాత, నెల్లుట్ల రమాదేవి, జ్వలిత, తమ్మెర రాధిక, ఎన్.అరుణ, కిరణ్‌బాల, రేణుక, మేరి, శ్రీలక్ష్మీ, దేవులపల్లి వాణి వంటి కవయిత్రులంతా స్త్రీలపై కనిపించని దాడి ఎట్లా జరుగుతుందో సమాజానికి తమ వాడి, వేడి కవిత్వం ద్వారా లోకం కళ్ళు తెరిపించే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఆత్మ విశ్వాసాన్ని మహిళల్లో కల్పించేలా, నారి శ్రమశక్తిని దోచుకునే అహంకారాన్ని ఖండించేలా ఇంకా కవితా వ్యవసాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అభ్యుదయమే కదా ఈ ఆధునిక కాలా నికి కావాల్సింది. మరి ఇంకెందుకాలస్యం? కలాలు కులాల పైనే కాదు పోటు వేయాల్సింది – మహిళా జాగృతి కోసం త్రవ్వకాలు మరొకసారి ఉత్తేజంతో ప్రారంభించాలి.“పైటను తగిలేసినా” మారని పరిస్థితులను ఎదుర్కునే స్థైర్యాన్నందివ్వ సమరశంఖం పూరించాలి.