Home జాతీయ వార్తలు సామాజిక న్యాయం

సామాజిక న్యాయం

బలీయ సమాజానికి అదే ప్రాతిపదిక
దేశ ప్రగతి పరిపూర్ణం
దళితులపై దాడులను సహించం
ద్రవ్యోల్బణం అదుపు, ప్రచార పథకాలకు దూరం
ఉగ్రవాదాన్ని సహించేది లేదు
మూడేళ్లలో 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు
స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ 20 శాతం పెంపు
ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ
ఆయుధాలు వదిలి రావాల్సిందిగా కశ్మీర్ యువతకు పిలుపు

pmన్యూఢిల్లీ: తరాలనాటి సాంఘిక దురచారాల ఫలితంగా దేశంలో దళి తులు, బలహీనవర్గాలపై దాడులు జరగడం ఆందోళనకరమని, సామా జిక న్యాయం ప్రాతిపదికతతోనే బలీయమైన సమాజం, తద్వారా బల మైన దేశం ఏర్పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 70వ స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి ఎర్రకోట నుంచి ఆయన ప్రసం గించారు. దేశంలో ఇటీవల దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడు ల అంశాన్ని ప్రస్తావించారు. సామాజిక న్యాయంతో కూడిన బలీయ మైన సమాజానికి ఆర్థిక ప్రగతి అనేది ఓ కచ్చితమైన గ్యారంటీ అవు తుందని తెలిపారు. దళితులపై దాడుల అంశం సాంఘిక దురాచారం అని పేర్కొన్న ప్రధాని ఇలాంటి అరాచకాల పట్ల, ఈ దురాచారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ అంశంపై మరింత విచక్షణాయుతం గా స్పందించాల్సి ఉందన్నారు.  కులతత్వం, అంటరానితనం వంటి తరాల నాటి అనాచారాలతోనే ఇప్పటికీ దేశంలో దళితులపై దాడులు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. దళితులపై దాడులను అరి కట్టేందుకు కఠినం, సమగ్ర దృక్పథం అవలంభించాలని, సామాజిక రుగ్మతలను నివారించే దిశలో సరైన వైఖరితో సాగాలని కోరారు. సామాజిక న్యాయాన్ని ఎందరో మహానుభావులు వాంఛించారని, సామాజిక ఐక్యతనే దేశానికి బలం చేకూరుస్తుందని పెద్దలు చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలని తెలిపారు. సమాజం అంటరాని వారు, ఇతరులు, అగ్రవర్ణాలు, అట్టడుగు కులాల వారిగా విభజితం అయితే అలాంటి సమాజం నిలవజాలదని హెచ్చరించారు.ద్రవ్యోల్బణం అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాని చెప్పారు. గత పాలకుల వైఖరికి భిన్నంగా తాము దేశంలో ప్రచార పథకాలకు (పాపులి జం)ను సాధ్యమైనంత దూరంగా వ్యవహరించామని , గత ప్రభుత్వాలు తమ ఉనికికోసం గుర్తింపు కోసం చేపట్టిన పథకాలతో చివరికి దేశ ఖజానాకు తూట్లు పొడిచారని ప్రధాని విమర్శించారు. ప్రభుత్వం ఏదో ఒక ప్రచార ఆర్బాటపు ప్రకటన చేయానేది ఇప్పటివరకూ ఆనవాయితీగా వస్తోందని అయితే తాము వీటికి దూరం అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే పనులు ఎంత కీలకమో, పనులు చేపట్టే విధానాలు కూడా అంతే ముఖ్యం అన్నారు. పారదర్శక, జవాబుదారి విధానాలతోనే పలు పనులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. పన్నుల వ్యవస్థ సంస్కరణల దిశలో ఇటీవలి జిఎస్‌టి కీలక మైలురాయి అవుతుందన్నారు. ఉగ్రవాదం ముందు భారతదేశం ఎప్పటికీ మోకరిల్లబోదని , యువత హింసావాదం వీడి, జనజీవ న స్రవంతిలోకి తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఎరకోట నుంచి జాతిని ఉద్ధేశించి తనదైన శైలిలో సుదీర్ఘ రీతిలో దాదాపు గంటన్నరకు పైగా ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు. పలు ప్రోద్బలాలతో తప్పుదారి పట్టిన యువత, హింసాత్మక ధోరణిని అవలంభిస్తున్న యువత తక్షణమే ఆ మార్గం వీడాలని , జనజీవన స్రవంతిలోకి విచ్చేయడం ద్వారా తమ భవితను తీర్చిదిద్దుకోవాలని , ఈ జాతికి మేలు తలపెట్టాలని పిలుపు నిచ్చారు. పాకిస్థాన్ చర్యలను పరోక్షంగా ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఎండగట్టారు. పిఒకె, బెలూచిస్థాన్‌లలో పాకిస్థాన్ సాగిస్తోన్న అరాచకాలను తాము ప్రస్తావించామని, దీనికి అక్కడి ప్రజల నుంచి తమకు కృతజ్ఞతలు అందినట్లు మోడీ గుర్తు చేశారు. కశ్మీర్ లోయలో జరుగుతున్న పరిణా మాలను ప్రధాని నేరుగా ప్రస్తావించలేదు. అయితే పాకిస్థాన్ ఉగ్రవాదులను కొనియాడటం, భారత్‌లో ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగి, ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకోవడం జరుగుతోందని ఇదీ ఆ దేశ సంకుచిత వైఖరి అని ప్రధాని మండి పడ్డారు.స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఇంతవరకూ భారత ప్రధాని ఎవరూ పాకిస్థాన్ అధీనంలోని కల్లోలిత, వివాదాస్పద ప్రాంతాల గురించి ప్రస్తావించలేదు.
రాజస్థానీ తలపాగా, పొట్టి చేతుల కుర్తా
స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చిన ప్రధాని తమ ప్రత్యేక సంకేత వేషధారణతో కన్పించారు. రాజస్థానీ తలపాగా, స్వచ్ఛమైన తెల్లటి సగం చేతుల కుర్తా, తెల్లటి పైజామాతో వచ్చిన ప్రధాని తమ ప్రసంగంలో ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రగతిని సాధించి పెట్టిందని వాటి వివరాలను ప్రస్తావించారు. ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిని ఇనుమడింపచేసేందుకు అన్ని చర్యలూ వినూత్నంగా తీసుకొంటోందని చెప్పారు. వ్యాపార నిర్వహణకు, పెట్టుబడుల రాకకు అనుకూల వాతావరణం నెలకొల్పినట్లు, ఇదే సమయ ంలో సంక్షేమ పథకాలు పేదలకు, రైతాంగానికి మరింత విస్తృతస్థాయిలో అందుతున్నట్లు చెప్పారు. దేశ స్వాతంత్య్ర సిద్ధికి తమ జీవితాలను పెట్టిన స్వాతంత్య్ర సమరయోధులను తగు విధంగా గుర్తించడం ప్రభుత్వ విధి అని పేర్కొంటూ ప్రధాని మోడీ వారి పింఛన్ మొత్తాన్ని ఇప్పటి కన్నా 20 శాతం పెంచుతున్నట్లు వాగ్దానం చేశారు. ఇక బిపిఎల్ కుటుంబాలకు వైద్య సాయం కింద లక్ష రూపాయలప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.
బుల్లెట్ ప్రూఫ్ లేకుండా నేరుగా

ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రధాని మోడీ ఈసారి ఎర్రకోట నుంచి జాతిని ఉద్ధేశించి బుల్లెట్‌ప్రూఫ్ గాజు రక్షణ వలయం లేకుండానే నేరుగా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. భద్రతా సిబ్బంది వారించినా సున్నితంగా తిరస్కరించి బహిరంగ పోడియం నుంచి మాట్లాడా రు. సాధారణంగా ప్రతిసారి ఎర్రకోట వేదిక నుంచి ప్రధానులు ప్రసంగాలు ఈ భద్రతా ఎన్‌క్లోజర్ నుంచే సాగుతూ వస్తున్నాయి. దీనికి మోడీ సెలవు పలికారు. తొలుత రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ప్రధాని తరువాత ఎర్రకోట చేరుకుని జెండా ఆవిష్కరణ తరువాత ప్రసంగించారు. తొలుత 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 125 కోట్ల మంది భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వరాజ్యం వచ్చిందని దీనిని సురాజ్యంగా మార్చుకోవల్సి ఉందని పిలుపు నిచ్చారు.
కృష్ణుడు, భీముడి ప్రస్తావన
భారతదేశ స్వాతంత్య్రం వెనుక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని చెప్పిన ప్రధాని మోడీ , దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరికి నిర్ణీత బాధ్యత ఉందన్నారు. కృష్ణుడు నుంచి గాంధీ వరకూ, భీముడు నుంచి భీంరావు అంబేద్కర్ వరకూ భారతదేశానికి సనాతన ఘన చర్రిత ఉందని , ముక్కలు చెక్కలైన దేశాన్ని సర్దార్ వల్లభాయి పటేల్ ఏకం చేశారని తెలిపారు.