Home ఎడిటోరియల్ సామాజిక మార్కెటింగ్ !

సామాజిక మార్కెటింగ్ !

Corporate-Cartoonప్రదాయకంగా ప్రజల మధ్య తేడాలు పాటించే సామాజిక అంశాల్లో తటస్థంగా ఉండే ‘కార్పొరేట్ రంగం’ క్రమంగా మారుతోంది. వాల్ మార్ట్ తరువాత ప్రముఖ ‘డిస్కౌంట్ రిటైలర్ దిగ్గజం’ టార్గెట్ సంస్థ తన అన్ని శాఖలలో ప్రైవేట్ బాత్ రూంలను నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఇంతకు ముందు స్త్రీ, పురుషులు కానివారు తమకు నప్పే ఏ బాత్‌రూంనైనా వాడుకోవ డానికి ఆ సంస్థ అనుమతించింది. దీనిపట్ల మితవాదులు చాలా మంది ఆగ్రహం వెలిగక్కారు. ప్రజలను విభజించే అంశాలలో పాత ఆనవాయితీలకు కంపెనీలు స్వస్తిపలుకుతున్నాయి.
బడా వ్యాపార సంస్థలు సామాజిక న్యాయం కోసం ముందుకు రావు. కాని ఇటీవల కాలంలో ఈ ధోరణిలో మార్పు వస్తోంది. టార్గెట్‌తోబాటు యాపిల్, వాల్‌మార్ట్, జనరల్ ఎలక్ట్రానిక్స్ వంటివి సామాజికంగా పురోగమన కార్యకర్తల పక్షం వహిస్తున్నాయి. కంపెనీల్లో క్యూబా విప్లవ హీరో చేగువెరా సిఇఒ అయినట్టుగా ఉంది పరిస్థితి. ఈ ఆహ్వానించదగ్గ పరిణామం ముఖ్యంగా స్త్రీపురుఫులు కాని మూడవ రకం వారికోసం సాధారణ సౌకర్యాలు కల్పించడంలో కనిపిస్తోంది. ఒక దశాబ్దం క్రిందటి పరిస్థితితో పోల్చితే ఇది ఖచ్చితం గా సామాజిక అంశాల పట్ల కంపెనీల సానుకూలతే అవుతుంది. కార్పొరేట్ సంస్థలు అధికారాన్ని చెలాయిస్తాయనడంలో ఎవరికీ సందేహం లేదు. అయితే అది వాణిజ్యం, పన్నులు వంటి నిత్యావ సర అంశాలపైనే తప్ప బలమైన సామాజిక అంశాలలో కాదు.
దశాబ్దాల క్రిందటి కదలిక
ఉదాహరణకు 1960లలో నాటి అమెరికాలోని ఉత్తర కరోలినాలో మొదలై దక్షిణ అమెరికా అంతటికీ ప్రాకిన పౌర హక్కుల ఉద్యమాన్నే తీసుకొంటే, అది గ్రీన్‌బోరోలోని వూల్‌వర్త్ లంచ్ కౌంటర్‌లో మొదలయింది.దానికి కారణం అక్కడ లంచ్ ఇవ్వడంలో జాతి భేదాలను పాలించడమే. స్థానిక ఆనవాయితీలను పాటించ డమే వూల్ వర్త్ విధానంగా ఉండింది. నల్ల జాతి, తెల్ల జాతి కస్టమర్లను విడిగా కూర్చోబెట్టేవారు. ఆ ఆనవాయితీ పాటించడం ద్వారా పురోగతికి ఆ సంస్థ అడ్డుపడింది. నిరసనగా విద్యార్థులు బైఠాయింపు జరపడమే ఆ ఉద్యమానికి మూలం.
ఆ ప్రచారంలో వ్యాపారంలో నష్టం చవిచూడడంతో ఆ సంస్థ పద్ధతి మార్చుకొన్నది. అది జరిగిన నాలుగు నెలల తరువాత ఆ సంస్థ తన తప్పు తెలుసుకొని లంచ్ నల్ల, తెల్ల జాతి వారికి కలిపి వడ్డించేది. సాధారణంగా కంపెనీలు మరింత స్వేచ్ఛా వైఖరిని అవలంబిస్తే ఖర్చులు పెరుగుతాయని భయపడుతూ వుంటాయి. ఇలాంటి ఉదంతాలు గతంలో అమెరికాలో చాలా జరిగాయి. సామాజిక దృష్టి లేకపోతే నష్టాలు వచ్చే పరిస్థితి తప్పదంటేనే కంపెనీల వైఖరిలో మార్పు వస్తోంది. మితవాదులను లెక్క చేయకుండా అవి మార్పుకు తెర తీస్తున్నాయి.
దుష్ట ఆనవాయితీలపై తిరుగుబాటు
2015 మార్చిలో అర్కాన్సాస్ శాసన సభ లింగ భేదాలను, మత స్వేచ్ఛను గౌరవిస్తూ పాటించాలని బిల్లును ఆమోదించింది. ఆ బిల్లు కు ఎదురైన తీవ్ర వ్యతిరేకతకు, కార్పొరేట్ల నిరసనకు తలొగ్గి గవర్నర్ బిల్లును సవరించాకే ఆమోద ముద్ర వేశారు. ఈ ఉదంతంపై ఇండియానా గవర్నర్ బాబీ జిందాల్ విరుద్ధంగా స్పందించారు. న్యూయార్క్ టైమ్స్ వ్యాసంలో కార్పొరేట్ సంస్థలు అర్కాన్సాస్‌లో వామపక్షాలతో దోస్తీ కడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
ఇంతకీ కంపెనీలు ‘స్థానిక ఆనవాయితీలు, ఆచారాలు’ పాటించడానికి ఎందుకు గుడ్ బై చెబుతున్నాయి. ఈ క్రమంలో అవి అధికారులను కూడా లెక్కచేయడం లేదు. ఎల్‌జిబిటి (లెస్బియన్ , గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ ) హక్కులకు బాహాటంగా మద్దతు పలుకుతున్నాయి.
యువత నవీన పోకడలే కారణం
ఈ విధంగా కార్పొరేట్ సంస్థల్లో ‘సామాజిక చురుకుదనం’ ఏర్పడడానికి రెండు కారణాలు కనిపిస్తు న్నాయి. మొదటిది సామాజిక ప్రచార సాధనాలు కాగా రెండవది వినియోగ దారులు, కార్మికులు, యువత వారిలో వచ్చిన మార్పు. కంపెనీల ‘సామాజిక విలువ’ కు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారు. యువత ఇష్టానిష్టాలను లక్షంగా చేసుకుంటున్న కంపెనీలు వారి సామాజిక కార్యక్రమాలను భుజాన వేసుకుంటున్నాయి. ‘టామ్ షూస్’, ‘వెర్బీ పార్కర్’ రెండు కంపెనీ లూ ఒక జత కొంటే ఒక జత ఉచితం అనే ప్రకటనలు ఇస్తూ వచ్చాయి. చిపొట్లే, స్టార్‌బక్స్ వంటి కంపెనీలు కూడా సక్రమ వ్యాపారానికి కట్టుబడి ఉన్నాయి. ఉద్యోగులను చేర్చుకోవడంలో కూడా సామాజిక కార్యక్రమాలకు విలువ ఇస్తున్నాయి. బిజినెస్ స్కూళ్ల రిక్రూట్‌మెంట్లలో కూడా అందర్నీ లింగ భేదాలు పాటించకుండా కలుపుకుపోయేవారికే ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు పురోగమన ధోరణిని అలవర్చుకొంటున్నాయి.
సామాజికంగా కూడా వస్తున్న మార్పులకు అనుగుణంగా వాటి వైఖరి మారుతోంది. ఉదాహరణకు 2004లో 31 శాతం ఉన్న ‘సేమ్ సెక్సు (సలింగ) వివాహాలు’ ప్రస్తుతం 55 శాతానికి పెరిగాయి. అయితే కార్పొరేట్ సంస్థల నవీన ధోరణికి వ్యతిరేకతలు కూడా ఎదురవు తున్నా యి. కొందరు వాటి తాజా ధోరణిని ‘దారి తప్పిన మార్కెటింగ్’ అని వెక్కిరిస్తున్నాయి.
కొత్త ధోరణులకు తప్పని ఎదురుగాలి
కొన్ని కంపెనీలు వ్యతిరేక ధోరణిలో పయనిస్తున్నాయి. టార్గెట్, స్టార్ బక్స్‌వలే కాకుండా ‘బైబిల్ కాలం నాటి విలువలు’ పేరుతో తిరోగమన పోకడలు అనుసరిస్తు న్నాయి. కొన్ని రాష్ట్రాలు పురోగమన ధోరణి, మరికొన్ని తిరోగమన ధోరణి అనుసరిస్తుండడంతో ఆ భేదం కార్పొరేట్ సంస్థల్లో కూడా కనిపిస్తోంది. ఇక వినియోగదారులు తమ అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న కంపెనీల బ్రాండ్లను ప్రోత్సహిస్తున్నారు.

– జెర్రీడేవిస్