Thursday, April 25, 2024

సోషల్ మీడియా ‘అరాచకమైనది’, నిషేధించాలి: గురుమూర్తి

- Advertisement -
- Advertisement -

Gurumurthy
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అరాచకమైనదని, దానిని నిషేధించాలని ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి మంగళవారం అన్నారు. ఆయన ‘నేషనల్ ప్రెస్ డే’(జాతీయ పత్రికా దినోత్సవం) ఈవెంట్‌లో కీలకోపన్యాసం చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఇక్కడి కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏరాటుచేసిన ఈవెంట్‌లో ప్రసంగిస్తూ “క్రమబద్ధమైన సమాజం మార్గంలో సోషల్ మీడియా అడ్డంకిగా ఉంది” అని అభిప్రాయపడ్డారు. కాగా ఆయన అభిప్రాయాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీనియర్ సభ్యులు వ్యతిరేకించారు.
“సోషల్ మీడియాను చైనా ధ్వంసంచేసింది. భారత్‌లో సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియా పాత్రపై ఆందోళన వ్యక్తంచేసింది. “మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లను నిషేధించాలి. ఫేస్‌బుక్ లేకుండా మనం జీవించలేమా?” అని ఆయన అన్నారు. ఆయన తమిళ రాజకీయ వార పత్రిక తుగ్లక్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. మయన్మార్, శ్రీలంకలో మాదిరి మనదేశంలో కూడా సోషల్ మీడియా అశాంతిని రెచ్చగొడుతోంది అన్నారు.
‘మీడియా అంటే ఎవరు భయపడరు?’ అన్న టాపిక్‌పై ఆయన ప్రసంగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ పూర్తి డాక్యుమెంటేషన్ నిర్వహించాలని ఆయన ప్రెస్ కౌన్సిల్‌ను కోరారు. ఆ తర్వాత ఓ ప్రశ్నకు ఆయన ప్రతిస్పందిస్తూ ‘నిషేధం’ అనేది కఠినంగానే అనిపించవచ్చు. కానీ ‘అరాచకత్వాన్ని నిషేధించాలి’ అని తాను విశ్వసిస్తున్నానన్నారు.
గురుమూర్తి అభిప్రాయాలను ప్రెస్ కౌన్సిల్‌లోని సభ్యులు వ్యతిరేకించారు. వారిలో జయప్రకాశ్ శుక్లా, గురుప్రీత్ సింగ్ వంటివారున్నారు. “ ప్రతి యుగం తనదైన ఫార్మాట్‌ను కలిగి ఉంటుంది. సోషల్ మీడియాలో అనేక పాజిటివ్ కోణాలున్నాయి. వాటిలో కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్(మూల్య రహితం) ఒకటి. అనేక విధాల సోషల్ మీడియా అనేది ఓ ముందడుగు…దానిని మనం ఆమోదించాలి. అది పోవాలని కోరుకోరాదు” అని గురుప్రీత్ సింగ్ తెలిపారు.
“త్రిపుర జర్నలిస్టుల అరెస్టు, ప్రభుత్వ సంస్థలు ఉపయోగిస్తున్న పెగాసస్ స్పైవేర్, రాఫెల్ కొనుగోలు ముడుపుల విషయంపై గురుమూర్తి ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని శుక్లా నిలదీశారు. “సోషల్ మీడియాను నిషేధించాక ఇక పత్రికా స్వేచ్ఛకు విలువ  ఏముంటుంది?” అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News