Home తాజా వార్తలు కీచక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

కీచక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Software

ఉద్యోగాల పేరిట యువతులకు ఆన్‌లైన్‌లో వల
16 రాష్ట్రాలలో 2000 మందిని వంచించిన వైనం
 నగ్న చిత్రాలు పంపాలంటూ వేధింపులు
ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్
నిందితున్ని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్(మియాపూర్) : శుక్రవారం మియపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ ఎస్‌ఐ రఘురాం తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన క్లెమెంట్ రాజ్ అలియాస్ ప్రదీప్ చెన్నైలోని టిసిఎస్ సాఫ్ట్‌వేర్ కం పెనీలో పని చేస్తున్నాడు. ప్రదీప్ దేశవ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, ప్రముఖ హోటళ్లలో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్‌సైట్ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు. అదే విధంగా సాఫ్ట్‌వేర్ ప్రదీప్ తన పేరు మార్చుకుని అర్చనా జగదీష్‌గా మహిళ పేరిట పేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేశాడు. ఉద్యోగం కావాలంటూ ఎవరైనా తనను సంప్రదించిన వెంటనే ఉద్యోగం కావాలంటే ఆకర్షణీయమైన రూపం ఉండాలని, శరీర భాగాలు కనపడేలా ఫోటోలు పంపించాలని మాయమాటలు చెప్పేవాడు.

ఫోటోల్లో ఆకర్షణీయంగా ఉంటేనే ఉద్యోగంతో పాటు అధిక వేతనం సొంతమవుతుందని నమ్మించేవాడు. ఈక్రమంలో ప్రదీప్ మాటలని నమ్మి 16 రాష్ట్రాలకు చెం దిన సుమారు 2 వేల మంది యువతులు తమ ఫొ టో ల్ని పంపించారు. కాగా మియాపూర్‌కి చెందిన ఒక బాధితురాలికి అనుమానం రావడంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి అం దించిన వివరాల సేకరించిన మియాపూర్ పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.
విడతల వారీగా ఫోటోల సేకరణ
ఉద్యోగాల కోసం ప్రదీప్‌ను ఆశ్రయించిన యువతుల ఫోటోలను విడతల వారీగా సేకరించినట్లు పోలీసులు వివరిస్తున్నారు. యువతులను ఇంటర్వూలో భాగంగా మొదటి రౌండ్లో పర్సనల్ డిటెయిల్ లను సేకరించి ఆపై న్యూడ్ ఫోటోలను పంపాలని యువతులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని పోలీసులు వివరించారు. వేలాది మంది అమ్మాయిలు అమాయకంగా మోసపోయి చివరికి బాధితుని చేతిలో మానసిక క్షోభకు గురయ్యారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా మియాపూర్‌లోని రాయిడ్ సన్ హోటల్ లో రిసెప్షన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ ఓ యువతిని నమ్మించాడు. ఆ యువతిని సైతం ఫోటోలు పంపాలని తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన సదరు యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఫోటోలతో బ్లాక్ మెయిల్ : ఆన్‌లైన్ వేదికగా ఆకర్షితులైన యువతుల ఫోన్ నెంబర్లను, వారి ఇతర వివరాలను సేకరించిన వెంటనే ఆయా నెంబర్లకు ఇంటర్వ్యూ పేరుతో సందేశాలు పంపేవాడు. అలా వారితో కనెక్ట్ అయిన వారిని మెల్లగా తన ట్రాప్‌లోకి దించేవాడు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారిని నమ్మబలికేవాడు.అయితే ఈ ఉద్యోగానికి ఫిజిక్ మంచిగా ఉండాలని, న్యూడ్ ఫోటో పంపిస్తే పరిశీలించి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తానంటూ, మంచి జీతం కూడా ఉంటుందంటూ వారిని నమ్మించేవాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని కీచకుడు ప్రదీప్ మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కాగా నిందితుడు ప్రదీప్ బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే నిందితుని ఫోన్‌లోనే కాకుండా తన మెయిల్‌లో ఉన్న ఫోటోల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

software Employee cheating 2000 young womens