Home తాజా వార్తలు ఆర్థిక ఇబ్బందులు మిగిల్చిన విషాదం

ఆర్థిక ఇబ్బందులు మిగిల్చిన విషాదం

Software employee family commit suicide in sangareddy

 

రామచంద్రాపురం : ఆర్థిక ఇబ్బందులకు తోడు తరచూ ఇంట్లో గొడవలు.. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. భర్త ఇంట్లో ఉరేసుకోగ భార్య తన ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం పరిధిలోని న్యూ ఎంఐజీ కాలనీలో నివాసముండే బాయికొడొల్ల చంద్రకాంత్ (35) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ భార్య లావణ్య (33) కొడుకు ప్రతమ్ (9), కూతరు సర్పగ్న (1) లతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఇటీవల కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చంద్రకాంత్‌కు కుటుంబ సభ్యులతో చరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా భార్య లావణ్యతో చంద్రకాంత్‌కు పెద్ద గొడవ కావడంతో లావణ్య పిల్లలు ఇద్దరినీ తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన చంద్రకాంత్ గురువారం రాత్రే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుండి పిల్లలతో కలిసి వెళ్లిపోయిన లావణ్య తన భర్త చంద్రకాంత్ ఆత్మహత్య విషయం తెలుసుకొని తాను కూడా పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి పరిధిలోని ఆందోల్ చెరువులో పిల్లలు ప్రతమ్, సర్పగ్నలతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉంటే లావణ్య పిల్లలతో ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో ఆమె సోదరి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి మిస్సింగ్ కంప్లైట్ చేసింది. శుక్రవారం ఉదయం ఆందోల్ చెరువులో గుర్తుతెలియని డెడ్‌బాడీలను గుర్తించిన పోలీసులు వివరాలు సేకరించి రామచంద్రాపురంలో మిస్సింగ్ అయిన లావణ్య, ప్రతమ్, సర్పగ్నలుగా గుర్తించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

తీసుకున్న లోన్లేకారణమయ్యాయా: చంద్రకాంత్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామం కాగా తండ్రి నాగేశ్వర్ రావు బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేస్తూ ఎంఐజీ కాలనీలో స్థిరపడ్డారు. కష్టపడి చదువుకున్న చంద్రకాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి వేలల్లో జీతం ఆర్జిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఓ క్తొత ఇళ్లు కట్టడానికి ఎక్కువ మొత్తంలో హోమ్ లోన్ తీసుకున్నాడని, అవి కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడని చంద్రకాంత్ స్నేహితులు తెలిపారు. అంతేకాక హోమ్ లోన్‌కే సాలరీ మొత్ంత పోతుండడంతో ఇళ్లు నడిపేందుకు క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిందని అవి కట్టే క్రమంలో కుటుంబంలో గొడవలు జరిగేవని పేర్కొన్నారు. గొడవలు ఎక్కువై తీవ్ర మనస్థాపంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకొని ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Software employee family commit suicide in sangareddy