Friday, April 19, 2024

దూసుకెళ్తున్న ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’

- Advertisement -
- Advertisement -

Software Sudheer

 

సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ రాజు నిర్మించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ఈ చిత్రం ఇటీవల విడుదలై అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ, శేఖర్ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ – “వెండితెర మీద వరుసగా రెండు గంటలపాటు ఉండే క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్‌లో ఊహించలేదు. అది ఈ సినిమాతో నిజమైంది. ఇక విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ లెవెల్ కి వెళ్ళింది”అని అన్నారు. నిర్మాత శేఖర్ రాజు మాట్లాడుతూ “నా మొదటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకి నేను ఎప్పటికీఈ రుణపడి ఉంటాను. కథ నచ్చి డబ్బు తీసుకోకుండా నటించిన డా.శివప్రసాద్‌కు ఈ సినిమాను అంకితమిస్తున్నాను”అని తెలిపారు. హీరోయిన్ ధన్యబాలకృష్ణ మాట్లాడుతూ – “ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మౌత్ పబ్లిసిటీతో సినిమా బాగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్నాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి”అని చెప్పారు.

Software Sudheer success meet
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News