Home తాజా వార్తలు అగ్నికంకణంలా సూర్యగ్రహణ సాక్షాత్కారం

అగ్నికంకణంలా సూర్యగ్రహణ సాక్షాత్కారం

Solar eclipse seemed like Ring of fire to people

 

న్యూఢిల్లీ : ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం దేశ ప్రజలకు అగ్ని కంకణంలా కనిపించింది. ఇది నాలుగో అరుదైన అద్భుత గ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. అగ్నికంకణం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఆదివారం సాక్షాత్కారమైంది. సూర్యుడు, చంద్రుడు అభిముఖంగా రావడంతో ఆదివారం మధ్యాహ్నం 1.50 వరకు స్పష్టంగా కనిపించింది. వందేళ్లలో ఇంత స్పష్టంగా కంకణాకారంలో కనిపించిన గ్రహణం ఇదేనని, ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం కాగా, దశాబ్దంలో ఇది 23 వ గ్రహణమని, శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా, షిల్లాంగ్, ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించగా, మూడు గంటల పాటు గ్రహణం కొనసాగింది. ఆసియా, ఆఫ్రికా, పసిఫిక్, హిందూమహాసముద్రం, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాలకు కూడా గ్రహణం కనిపించింది.