Home ఆఫ్ బీట్ వీడియోలు వాట్ ఏ ఐడియా సర్జీ!(వీడియో)

వాట్ ఏ ఐడియా సర్జీ!(వీడియో)

Solar Fan Umbrellaఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే ఓ ప్రముఖ టెలికాం ఆపరేటర్ కు సంబంధించిన యాడ్ ను మీరు చూసే ఉంటారు. అలాగే ఒక ఐడియా ఈ తాతను ఎండ నుంచి సేదతీరేలా చేసింది. అదే… సోలార్ ఫ్యాన్ గొడుగు. మాములుగా మనకు గొడుగు తెలుసు. కానీ, ఈ సోలార్ గొడుకు ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. వేసవి కాలంలో భానుడి భగభగల నుంచి తప్పించుకోవడంలో భాగంగానే మన తాతకు ఈ సోలార్ ఫ్యాన్ గొడుగు ఐడియా తట్టిందట. దాంతో దాన్ని ఆచరణలో పెట్టాడు. ఓ గొడుగుకు చిన్న ఫ్యాన్ అమర్చాడు. ఆ తరువాత గొడుగు పై భాగంలో రెండు చిన్న చిన్న సోలార్ పలకలను బిగించాడు. వాటి ద్వారా వచ్చే సోలార్ విద్యుత్ తో నే గొడుగు లోపల ఉన్న ఫ్యాన్ పనిచేస్తుంది. ఇలా సోలార్ గొడుగును రెడీ చేశాడు. ఒకసారి ఆయన ఈ గొడుగు వేసుకొని బయట వచ్చినప్పుడు కొందరు పాదచారులు ఆయనను ఈ కొత్త ఆవిష్కరణ గురించి ప్రశ్నించారు. ఆ సమయంలో తనకు సమ్మర్ బ్లాస్ట్ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనే సోలార్ ఫ్యాన్ గొడుగును తయారు చేసేలా చేసిందని చెప్పుకొచ్చాడు. అనంతరం అది ఎలా పని చేస్తుందో వివరించాడు. తాత మాట్లాడిన సమయంలో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ గొడుగుతో ఆ పెద్దాయన ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతుండటం విశేషం.

Solar Fan Umbrella Video goes Viral