Home జాతీయ వార్తలు తోటి జవాన్‌ను కత్తితో పొడిచిన సైనికుడు

తోటి జవాన్‌ను కత్తితో పొడిచిన సైనికుడు

armyశ్రీనగర్: ఓ సైనికుడు తోటి జవాన్‌ను కత్తితో పొడిచి తరువాత మెషీన్‌గన్తో పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జమ్మూ కశ్మీర్‌లో అజ్మిత్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న రఘువీర్ సింగ్‌పై రాజీవ్ దాడి చేశాడు. రఘువీర్ సింగ్ వద్ద ఉన్న మెషీన్ గన్, పది బులెట్లతో అతను పరారీలో ఉన్నాడు. జులై 21 నుంచి రాజీవ్‌కు సెలవులు మంజూరు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌కు సెలవు ఇచ్చినప్పటికి ఇంటికి వెళ్లకుండా రఘువీర్‌పై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. బీహార్ చెందిన రాజీవ్ కూడా ఇదే అజ్మిత్ పోస్టు వద్ద విధులు నిర్వహించేవాడని ఉన్నతాధికారులు వెల్లడించారు.