- Advertisement -
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని మచిల్ సెక్టార్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మంచు చరియలు విరిగి పడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 28న మచిల్ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడటంతో సైనికులు గల్లంతయ్యారు. వీరి కోసం సైన్యం గాలించగా, సోమవారం మృతదేహలు లభ్యమయ్యాయి. కాగా సైనికుల మృత దేహాలను వెలికి తీసిన అధికారులు వారి మృత దేహాలను మంగళవారం స్వస్థలాలకు పంపుతామని తెలిపారు. కశ్మీర్లో ఇటీవల పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడిన దుర్ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 14 మంది సైనికులు ఉన్న విషయం తెలిసిందే.
- Advertisement -