Home జాతీయ వార్తలు యుద్ధం వచ్చే అవకాశం ఉందా…?

యుద్ధం వచ్చే అవకాశం ఉందా…?

Indian Armyహైదరాబాద్ : జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధానికి సిద్ధమవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పిఒకెను కూడా తాము స్వాధీనం చేసుకుంటామని భారత్ తేల్చి చెబుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సరిహద్దుకు సైనిక బలగాలను తరలిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సైనికులను రోడ్డు, వాయు మార్గాల్లో కశ్మీర్ కు తరలిస్తున్నారు. సైనికుల తరలింపుపై అధికారులు స్పందించడం లేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి, దీని గురించి అడుగొద్దని వారు సూచిస్తున్నారు. దీంతో కశ్మీర్ లో ఏం జరుగుతుందో తెలియక దేశ ప్రజలు ఆందోళనతో కూడి ఆసక్తితో ఉన్నారు.

Soldiers Evacuation To Kashmir From Cantonment