Home లైఫ్ స్టైల్ సోలోలైఫ్ సో బెటర్…!

సోలోలైఫ్ సో బెటర్…!

Solo Life

 

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అధ్యయనకారులు ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఒంటరి స్త్రీలు, తమతోటి పెళ్లయిన వాళ్లకంటే ఎన్నో రెట్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారట. కానీ వాళ్లతో పోలిస్తే పెళ్లయిన మగవాళ్లు, పెళ్ళికాని వాళ్లకంటే ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. పెళ్ళి మగవాళ్లకు తక్కువ చాకిరీ, ఎక్కువ సౌకర్యాలు ఇచ్చి ఉండచ్చు అని కూడా అధ్యయనకారులు అభిప్రాయ పడ్డారు. కొన్ని వందలమంది సింగిల్ ఉమన్ పైన చేసిన ఈ అధ్యయనంలో వారిలో 99 మంది తాము స్వేచ్ఛగా, సంతోషంగా, తాము అనుకున్న లక్షాలను సాగించే దిశగా సాగుతూ ఆరోగ్యంగా ఉన్నామనే చెప్పారు.

భారతదేశంలో ఈ సింగిల్ ఉమన్ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొన్ని పాలిటిన్ సిటీస్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్న అమ్మాయిలు పెళ్లి పట్ల ఒక రకంగా విముఖంగా ఉన్నారు కూడా. ఇవ్వాల్టి రోజుల్లో అమ్మాయిలు చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. కెరీర్ విషయంలో స్త్రీ పురుష విచక్షణ ఎప్పుడూ ఉండదు. కానీ ఈ కెరీర్ కోసం, తాము అనుకున్న లక్షాలు చేరుకోవటం కోసం అమ్మాయిలు పెళ్లి ప్రతిబంధకంగానే అనిపిస్తోందని ఒక అధ్యయనం చెబుతోంది.

సింగిల్‌గా ఉన్నా ఒక సైకాలజిస్ట్ మాటల్లో చెప్పాలంటే కెరీర్ దిశగా ఎదగాలంటే సింగిల్ కూడా బెస్ట్ ఆప్షన్. ప్రతి చిన్న విషయానికీ పర్మిషన్ తీసుకోవటం, కుటుంబం పరిధిల్లో మన జీవితం కుదించుకోవటం ఇవన్నీ జీవితంలో అత్యున్నత స్థానంలోకి ఎదిగేందుకు అవరోధాలే’ అంటోంది. సమయాన్ని డబ్బుని సొంత ఎదుగుదల కోసం నిష్పూచిగా ఖర్చు చేసుకోవచ్చు. చుట్టూ సమాజం దాన్ని ఏదో ప్రత్యేకంగా చూడటం వల్ల కాస్త ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ మన సొంత సమయం, సొంత నిర్ణయం, సొంత జీవితం ఆ ఇబ్బందిని పక్కకు తోస్తేస్తుంది అంటుందామె.

ఒక పేరున్న యూనివర్శిటీలో డీన్‌గా పని చేస్తున్న యాభై సంవత్సరాల అనూరాధ దృష్టిలో ‘ సింగిల్ ఉమన్‌గా జీవించటం వల్ల నామటుకు నేను నష్టపోలేదు. ఒక సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చాను కనుక, మా కుటుంబం చాలా భయపెట్టింది. నీవు వయసులో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కానీ నీ వృద్ధాప్యంలో తోడు లేకుండా అయిపోతావని నా బంధుమిత్రులు వాదించారు. కానీ ఇవ్వాళ వాళ్లలో చాలా మంది వాళ్ల పిల్లలు ఉన్నత చదువులు చదివి ఫారన్ కంట్రీస్‌లో ఉద్యోగాలకు పోవటం వల్ల ఒంటరిగా ఉన్నారు. నా జీవితంలో నాకున్న ఆర్థిక భద్రత వారికి లేదు. వాళ్లు చాలా మంది పిల్లలపైన ఆధారపడ్డారు.

నేను ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచి భవిష్యత్ గురించి ఆలోచించుకున్నాను. కొత్త కొత్త కోర్సులు చేశాను, డబుల్ డిగ్రీలు పొందాను. ఆర్థికంగా నా జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకున్నాను. ఒంటరితనం నాకు కష్టంగా లేదు అంటున్నారు. కానీ చాలామంది మా బంధువులు జీవితం మొత్తంగా ఏదో అభద్రతతో బాధపడ్డారు. పిల్లల కోసం సంపాదన అంతా ఇన్వెస్ట్ చేస్తూ వాళ్లు భవిష్యత్‌లో మమ్మల్ని చూస్తారా అన్ని సందేహంలో పడ్డారు. కొందరు పిల్లలే లోకంగా బతికి వాళ్లు రెక్కలొచ్చి ఎగిరిపోతే బాధపడ్డారు. ఒంటరిగా జీవించేందుకు భయపడ్డారు. కానీ నేను వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్‌గా మారాను. నా కెరీర్‌ను సంతోషాన్ని, నేను జీవించదలుచుకున్న జీవితాన్ని చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను. దాదాపు ప్రతి సెలవులో నేను ప్రపంచం మొత్తం ఒక్కటిగా చుట్టుకుంటూ వచ్చాను. నిజంగానే ఒంటరిదాన్ని కనుక, ఎక్కడకు వెళ్లినా ఏ సమస్య లేకుండా ప్రతిదీ పద్ధతిగా ప్లాన్ చేసుకున్నాను. ఆప్తులైన స్నేహితులు తోడుగా నేను చాలా సంతోషంగా జీవితం నిర్మించుకున్నాను” అన్నారు అనూరాధ.

ఇండస్ట్రియలిస్ట్‌గా ఉన్న ఉమ అనుభవం ఇంకో రకంగా ఉంది. ‘ నేను నా బిజినెస్ మొదలుపెట్టినపుడు మొదట్లో నాకు చాలా నష్టాలు వచ్చా యి. నేను సింగిల్ గానే ఉన్నాను కాబ ట్టి నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్లు లేరు. నా కుటుంబ సభ్యులు నా కెరీర్ సవ్యంగా సాగాలని తోడుగా ఉన్నారు. నాకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ, కష్టనష్టాలకు వెనుకకు తిరగకుండా నా వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాను. నేను ఇవ్వాళ ఇంత బిజినెస్‌ను నిర్వహిస్తున్నాను. ఆరోగ్యంగా, స్వేచ్ఛగా ఉన్నాను అంటే నేను సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకోవటం వల్లనే’ అంటోంది ఉమ. కుటుంబ జీవితంలో భద్రత, తోడు, పిల్లలు, ఒక కుటుం బం ఇవన్నీ ఉంటాయి.

కానీ ఆ జీవితంలో ఉండే ఒక అసౌకర్యాన్ని ఈనాటి అమ్మాయిలు కాదనుకుంటున్నారు. అభిప్రాయాలు ఇంకొకరితో పంచుకోవటం, ఒకళ్లకు జవాబుదారిగా ఉండటం, ఒకర్ని ప్రతి విషయానికీ ఒప్పించవలసి రావటం, స్వేచ్ఛ లేకపోవటం, కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు పిల్లల గురించి ఆలోచించి ఉద్యోగాలను పణంగా పెట్టటం, తాము పెరిగే వయసు లో చుట్టూ ఉన్న కుటుంబాల్లో క నిపించే స్త్రీల పట్ల అణచివేత, క్రూ రత్వం ఇవి కూడా ఇవ్వాళ్టి అమ్మాయిలకు పెళ్లి పట్ల విముఖ త్వం కలుగజేస్తున్నాయి. ఏదైనా స్వే చ్ఛగా, భద్రంగా, సంతోషంగా ఉండేందుకు ఒంటరి జీవితానికే ఓటు వేస్తున్నారు.

Solo Life So Better