Friday, July 11, 2025

పైరసీపై కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) తెలిపారు. బుధవారం ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫ్‌డిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ “రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించాము. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న(facing industry) సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నాము. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తాము.

ఎఫ్‌డీసీ నోడల్ ఏజెన్సీగా , ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్‌లకు ఆన్‌లైన్ అనుమతుల ప్రాసెస్‌తో పాటు వీడియో పైర సీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాము”అని అన్నారు. ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్. ప్రియాంక మాట్లాడుతూ సినిమా జర్నలిస్టుల అక్రిడిషన్ అంశంపై సమీక్ష జరిపి, సాధ్యసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యలపై ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తప్పకుండా తాము కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News