Home రాష్ట్ర వార్తలు స్మార్ట్ ఇండియా హాకథాన్‌తో సమస్యల పరిష్కారం

స్మార్ట్ ఇండియా హాకథాన్‌తో సమస్యల పరిష్కారం

mike

*కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

మన తెలంగాణ/మేడ్చల్ (మేడ్చల్ జిల్లా) : సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలు అవసరమని తైవాన్ వంటి చిన్న దేశాలు కూడా సాంకేతిక రంగంలో ముందుంటున్నాయని ప్రసిద్ధ్ది చెందిన మనదేశం సాంకేతిక రంగంలో వెనుకంజలో ఉందని సవాళ్లను అధిగమించేందుకు స్మార్ట్ ఇండియా హాకథాన్ ఎంతో ప్రయోజనకరమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఎంహెచ్‌ఆర్‌డి, ఎఐసిటిఇ, ఐ4సిలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా 28 కేంద్రాలలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హాకథాన్-2018 కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండల పరిధిలోని సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో స్మార్ట్ ఇండియా హాకథాన్ – 2018 కేంద్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆన్‌లైన్ ద్వారా హాకథాన్‌లో పాల్గొంటున్న విద్యార్థులకు సందేశాన్ని అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం డిజిటల్ ఇండియా, స్మార్ట్ ఇండియాతో దేశంలో సాంకేతిరంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు హాకథాన్ దారిచూపిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ముందుకు..
స్మార్ట్ ఇండియా హాకథాన్ – 2018ను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ సహస్ర బుద్దె మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను వారు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా స్ఫూర్తితో హాకథాన్ ముందుకు సాగుతుందని అన్నారు. ఎంపి మల్లారెడ్డి , సీఎంఆర్ విద్యాసంస్థల సెక్రెటరీ కరస్పాండెంట్ సి.హెచ్. గోపాల్‌రెడ్డి, సభ్యులు భూపాల్‌రెడ్డి, పాల్గ్గొన్నారు.