Home లైఫ్ స్టైల్ పర్యావరక్షణ ఇలా…

పర్యావరక్షణ ఇలా…

ప్రతి ఒక్కరూ తమ వంతుగా కొన్ని పనులు చేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో మొక్కలు పెంచాలి.  చెత్తను కాల్చకుండా చెత్త తీసుకువెళ్లే బండివారికి ఇవ్వాలి.  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. సరుకుల కోసం బజారు వెళ్లాల్సి వచ్చినపుడు వెంట గుడ్డ, జనపనార సంచీలను తీసుకెళ్లాలి. మంచి నీళ్లు కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్లాలి. ఈవిధంగా ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం తగ్గించుకోవచ్చు. ఇంధనం వాడకాన్ని తగ్గించాలి. చేరాల్సిన గమ్యం దగ్గరగా ఉన్నట్లయితే నడిచి వెళ్లడం ఉత్తమం. ఆరోగ్యానికి మంచిది. కాలుష్యం తగ్గుతుంది. పనికి రాని వస్తువులను వెంటనే పడేయాలి. లేకుండా పాత వస్తువుల వానికి అమ్మేయాలి. 

GoGreen_group

పర్యావరణాన్ని కాపాడాలి..అది చేయాలి ఇది చేయాలి అంటూ అందరూ ఉపన్యాసాలు దంచుతుంటారు..మన వంతుగా ఏం చేస్తున్నాం అనేది ఎవరికి వారే ఆలోచించాలి. ఒక్కోసారి ఒక్కరి వల్ల కాని పనులు సమూహం వల్ల సాధ్యమవుతాయి. కాలనీవాసులంతా తలుచుకుంటే పచ్చదనం తోపాటు ఆరోగ్యాన్ని కూడా అందరూ పొందినవారవుతారు. పర్యావరణ హితం కోసం పోరాడినవారు అవుతారు. అందరితో కలిసి ప్రకృతిని కాపాడే పనుల్లో పాలుపంచుకోవడం వల్ల రోగనిరోధక శక్తితోపాటు ఒత్తిడి తగ్గుతుంది.
మంచి ఆహారం తీసుకోవడం
ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయల్ని పెంచుకోవడం. వంటింట్లో సహ జంగా లభ్యమయ్యే ఎరువు వేసి పెంచిన కూరగాయలు, ఆకుకూరల్ని తినడం వల్ల ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. సహజంగా పోషకాలు లభిస్తాయి. ఒకవేళ మీ చుట్టుపక్కల పెద్ద గార్డెన్ పెంచుకున్నట్లయితే దాంట్లో మొక్కల్ని పెంచి వ్యాపారంగా కూడా మలుచుకోవచ్చు. పెద్ద పెద్ద మాల్స్ లో కూరగాయలను కొనడం కంటే, స్థానికంగా కూరగాయలు పండించే రైతుల వద్ద నుంచి కూరలను కొనుగోలు చేయడం వల్ల వారికి సాయం చేసినవారమౌతాం.
సైకిల్‌ను ఉపయోగించడం
మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని చిన్న పనులకు నడిచి వెళ్లేలా, లేదా సైకిల్ ఉపయోగించేలా ప్రోత్సహించాలి. రోజుమొత్తంలో కారులో ప్రయాణిస్తుంటే ప్రతి గంటకు ఆరు శాతం ఊబకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. ఊబకాయం వల్ల దీర్ఘకాల రోగాలు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. రహదారిపై అనేక వాహనాలు ఉండటం వల్ల తీవ్ర ఒత్తిడితోపాటు కాలుష్యం వెలువడుతుంది. ట్రాఫిక్ రద్దీ, పొగబారిన పడటం జరుగుతుంది.

  • చుట్టుపక్కల దొరికే వస్తువులనే కొనుగోలు చేయాలి..దీనివల్ల కాలనీల్లోని వ్యాపారులను ప్రోత్సహించినట్లవుతుంది. ఎక్కువ దూరాలు వెళ్లి షాపింగ్ చేయడం వల్ల ఇంధనం ఖర్చు, శ్రమలాంటివి తగ్గుతాయి.
  • చుట్టుపక్కల ఉండే వ్యర్థాల వల్ల ముందుగా ప్రభావం చూపేది చిన్నపిల్లల మీదే. సిగరెట్ పీకలు, పాత టైర్లు, జంక్ ఫుడ్ రేపర్లు ఇవన్నింటిలో ఉండే

విషపూరితమైన రసాయనాలు మూగజీవాలను కూడా పొట్టన బెట్టుకునే అవకాశం ఉంది. అప్పుడప్పుడూ కొంతమంది చెత్తకు నిప్పు పెడుతూ ఉంటారు. ఈ గాలిలో వెలువడే విష రసాయనాల వల్ల వాతావరణం కాలుష్యమౌతుంది. భూగర్భ డ్రైనేజీలోని మంచి నీరు కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉంది. కమ్యూనిటీ కంపోస్ట్ కేంద్రంగా ఏర్పాటు చేసుకుని మీరు పెంచే మొక్కల కోసం ఉమ్మడిగా ఉపయోగించుకోవచ్చు.
చెట్లు పెంచడం బాధ్యత
కాలనీలో ప్రతి ఒక్కరూ చెట్లు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకోవాలి. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ నుంచి తప్పించుకోవచ్చు. ప్రభుత్వం ఇందుకు ఉచితంగా మొక్కలనుకూడా సరఫరా చేస్తుంది. ఆసుపత్రుల్లో మొక్కలను పెంచడం, లాన్‌లను ఏర్పాటు చేయడం వల్ల రోగులు మానసనికంగా ఆరోగ్యవంతులై త్వరగా తమ జబ్బుల నుంచి బయటపడతారని ఓ సర్వేలో తేలింది. కాలనీవాసులంతా కలిసి పార్కులలు, వ్యాహ్యాళికి, సైకిల్ నడపడానికి సరిపడా స్థలాన్ని ఏర్పాటుచేసుకోవాలి.