Home తాజా వార్తలు మామను హత్య చేసిన అల్లుడు

మామను హత్య చేసిన అల్లుడు

murder

 

మంథని : పాతకక్షలతో మామను అల్లుడు హత్య చేసిన సంఘటన మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుని కూతురుతో అల్లుడు శ్రీనివాస్ తరచుగా గొడవపడుతుండడంతో గతంలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ విషయంపై భట్టుపల్లి గ్రామంలో మామ అల్లులు గోడవపడ్డారు. ఈ గొడవలో అల్లుడు శ్రీనివాస్ మామ లక్ష్మయ్యను కర్రతో తలపై కొట్టడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Son-in-law who murdered his uncle