Home తాజా వార్తలు తండ్రి ప్రవర్తన నచ్చక…

తండ్రి ప్రవర్తన నచ్చక…

Murder

నిజామాబాద్‌ : ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం దారుణ ఘటన జరిగింది. ప్రశాంత్ అనే యువకుడు తన  తండ్రిని హత్య చేశాడు. నాలుగు నెలల  క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్‌ తండ్రి మూడు రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తండ్రి ప్రవర్తన నచ్చని ప్రశాంత్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Son Killed his Father in Yellareddy pally in Indalwai