Wednesday, April 24, 2024

తండ్రికి విడాకులు ఇవ్వడంలేదని తల్లిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తండ్రికి విడాకులు ఇవ్వడంలేదని తల్లిని కుమారుడు చంపిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సత్యరాజ్, మణేమ్మ (పేర్లు మార్చబడినవి) అనే దంపతులు మధ్య గొడవలు రావడంతో గత మూడేళ్ల నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. తండ్రి విడాకులు కావాలని కోర్టులో కేసు వేశాడు. తల్లి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో పలుమార్లు తల్లితో తనయుడు గొడవపడ్డాడు. తండ్రితో పెద్ద కుమారుడు కలిసి ఉంటున్నాడు. విడాకులు ఇవ్వకపోతే తల్లిని చంపేస్తానని పలుమార్లు ఆమె పెద్ద కుమారుడు బెదిరించాడు. డిసెంబర్ 1న తల్లిని చంపి ఇంటి ఆవరణంలో ఇటుక కుప్పల మధ్య మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించి ఆమె కూతురుకు సమాచారం ఇచ్చారు. కూతురు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాం తన తల్లిదేనని సోదరుడుకి ఫోన్ చేసింది. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. తన సోదరుడిపై అనుమానం ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని తనదైన శైలి ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. నిందితుడిని పట్టుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News