Home తాజా వార్తలు ’మర్డర్‘ సినిమా నుంచి పాట విడుదల

’మర్డర్‘ సినిమా నుంచి పాట విడుదల

Song Release From RGV Murder Movieహైదరాబాద్ : ’మర్డర్‘ సినిమా నుంచి పిల్లల్ని ప్రేమించడం తప్పా…? అంటూ సాగే పాటను మంగళవారం ఉదయం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. యధార్థ ప్రేమ, హత్య కథనాలను ఇతివృత్తంగా తీసుకుని ’మర్డర్‘ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ’ మర్డర్‘ సినిమాపై కోర్టులో వివాదం నడుస్తోంది. దీంతో ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశమైంది.