Home జాతీయ వార్తలు కపట రాజకీయ నేతలకు గాంధీ త్యాగాలు అర్ధం కావు

కపట రాజకీయ నేతలకు గాంధీ త్యాగాలు అర్ధం కావు

Sonia Gandhi

 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శ

న్యూఢిల్లీ : తామే సుప్రీం అనుకుని కపట రాజకీయాలతో గడిపేవారు మహాత్మాగాంధీ త్యాగాలు, అహింసా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోలేరని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం స్పష్టం చేశారు. రాజ్‌ఘాట్ గాంధీ సమాధి వద్ద ప్రస్తుత బిజెపి పాలకుల తీరును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న సంఘటనలకు మహాత్ముని ఆత్మ క్షోభిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలకు గాంధీ సిద్ధాంతాలపై ప్రమాణం చేయిస్తూ గాంధీకి నివాళులు అర్పించారు.

భారత్‌కు పర్యాయం మహాత్మాగాంధీ కాగా, కొందరు భారత్‌కు పర్యాయం ఆర్‌ఎస్‌ఎస్ ఉండాలని కాంక్షిస్తున్నారని మహాత్మాగాంధీ వల్లనే ప్రస్తుత భారత్ ఆవిర్భవించిందని ఆమె పేర్కొన్నారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీన్‌దయాళ్ మార్గ్ లోని ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలతో రాజ్‌ఘాట్ వరకు మూడు కిమీ పొడవున గాంధీ సందేశ్ పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ కార్యకర్తలు నినాదాలు హోరెత్తించాయి. గాంధీ కళ్లద్దాలు, ధోతీ ధరించి, ఊతకర్రలు పట్టుకుని యువకులు చాలామంది యాత్రలో పాల్గొన్నారు. సోనియాతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితర నేతలు గాంధీకి నివాళులు అర్పించారు.

Sonia Gandhi said BJP trying to sideline Mahtma Gandhi