Home తాజా వార్తలు 28 వేల మంది నిసర్గ బాధితులకు సోనూ సాయం

28 వేల మంది నిసర్గ బాధితులకు సోనూ సాయం

Sonu Sood Helped Keep 28,000 People Safe

 

ముంబై : బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నిసర్గ తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. 28 వేల మంది పేదలకు ఆహార, పునరావాస ఏర్పాట్లు చేస్తానని ఆయన గురువారం ప్రకటించారు. ముంబై తీర ప్రాంతంలో నిసర్గ విరుచుకుపడనుంది. దీనితో పలువురు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. సమాజంలోని అణగారిన వర్గాలకు ఇటువంటి దశలో మేలు చేయాల్సి ఉందని నటుడు తెలిపారు.

వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా వైరస్‌తో ఇప్పటికే మురికివాడల ప్రజలు ఉపాధి కోల్పోయి నానాబాధలు పడుతున్నారు. వీరిని ఆదుకోవడంతో పాటు వారి వారి స్వస్థలాలకు రైళ్లు ఇతరత్రా రవాణా ఏర్పాట్ల ద్వారా పంపించారు. పేదలకు ప్రస్తుతం వచ్చిపడ్డ తుపాన్‌తో మరో క్లిష్ట సమస్య వచ్చిపడిందని, మొత్తం 28000 మంది తీర ప్రాంత ప్రజలను సురక్షిత స్థలాలకు చేరుస్తామని, తమ బృందం వారిని కాలేజీలు, స్కూళ్ల ఆవరణలకు చేర్చిందని, వారికి భోజన ఏర్పాట్లు చేస్తామని వివరించారు.

Sonu Sood Helped Keep 28,000 People Safe