Friday, March 29, 2024

పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం..

- Advertisement -
- Advertisement -

పేద విద్యార్థుల కోసం సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం
తల్లి పేరిట చాటుకున్న ఔదార్యం, రెండు లక్షల వార్షికాదాయ పరిమితి

ముంబై: నటుడు సోనూసూద్ మరో మంచి పనికి నడుంబిగించారు. కరోనా సమయంలో వలసకార్మికులకు అనేక విధాలుగా సాయం అందించిన సోనూసూద్ ఇప్పుడు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనుననట్లు ప్రకటించారు. తన దివంగత తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరిట ఈ సాయం అందిస్తానని ప్రకటించారు. దీనికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చునని కోరారు. పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు ఉన్నత విద్యకు తమ పిల్లలను పంపించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తోంది. పేదలైన తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యావంతులు కాలేకపోవడం, వారూ తమలాగానే కూలీనాలి చేసుకునే పరిస్థితి ఏర్పడటం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. దీనిని గమనించే తన తల్లి పేరిట ఈ స్కాలర్‌షిప్‌ల స్కీంను తీసుకువస్తున్నట్లు సోనూ సూద్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, తన తల్లిపేరు మీద స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు మాటిస్తున్నట్లు తెలిపారు. తల్లి పంజాబ్‌లో పేదల పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేసేవారని, పెరిగి పెద్దయిన తరువాత పేదింటి పిల్లల చదువులకు ఏదో విధంగా సాయపడాలని చెప్పేవారని సోనూసూద్ తెలిపారు. ఆమె స్ఫూర్తితోఈ పారితోషికం అందించాలని సంకల్పించినట్లు తెలిపారు. చాలా కాలం తరువాత తన ఆశయం నేరవేరుతోందని, ప్రస్తుతం పేదింటి పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు సరైన విధంగా హాజరు కాలేకపోతున్నారని, వారికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, చదువుకునే సౌకర్యాలు లేకపోవడంతో ఈ స్కాలర్‌షిప్‌ల పథకం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. వలస కూలీలు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి ఆయన ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా పలువురి నుంచి ప్రశంసలు పొందారు. రెండు లక్షల రూపాయల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ స్కాలర్‌పిప్ అర్హత ఉంటుంది. వారు దీని కోసం తనకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అయితే ఈ విద్యార్థులు తమ చదువులలో ప్రతిభ గడించి, సరైన మార్కులు తెచ్చుకుని ఉండాలి, వారికి తగు కోర్సుల ఫీజులు, ఉండేందుకు వసతి, ఆహారం అన్ని తామే చూసుకుంటామని ఈ హీరో వెల్లడించారు. ఇప్పటికే పలు సందర్భాలలో తన తల్లి పెద్ద మనసు గురించి పలు సార్లు ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె బొమ్మ వేశారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని తల్చుకుంటూ ఆమె చూపిన బాటలోనే వెళ్లుతున్నట్లు, ఇది చాలా దూరం సాగాల్సిన పయనం అని, గమ్యం బహుదూరంలో ఉందని తెలిపారు. అమ్మా… ఈ గమ్యం అంటే కొందరికి ఎంతో కొంత మేలు చేసే లక్ష్యం చేరుకోవడం జరుగుతుంది. దీనిని ఖచ్చితంగా చేరుకుని తీరుతా అని తెలియచేసుకున్నారు. ఇప్పుడు ఈ స్కాలర్‌షిప్ పథకానికి శ్రీకారం చుట్టారు. పేదింటి ప్రతిభావంతులైన విద్యార్థుల విద్యాభ్యాసపు కలను నిజం చేసేందుకు సరికొత్త స్కెచ్ వేసుకుని సాగుతున్న సోనూ నిజమైన హీరో అని ప్రశంసలు వెలువడుతున్నాయి.

Sonu Sood launches scholarship scheme for poor students

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News