Home టెక్ ట్రెండ్స్ సోనీ నుంచి కొత్త ఆండ్రాయిడ్ టివిలు..

సోనీ నుంచి కొత్త ఆండ్రాయిడ్ టివిలు..

Sony Launches Bravia KD-85X9000F And KD-65X9000F

హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ సోనీ బ్రావియా సిరీస్‌లో  బ్రావియా ఎ9ఎఫ్ పేరిట 65,55 ఇంచుల మోడల్స్ లో నూతన ఆండ్రాయిడ్ టివిలను  ఇవాళ భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఈ టివిలలో అధునాతన పిక్చర్ ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఈ టివిల్లో కనిపించే దృశ్యాలు నాణ్యంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అలాగే 4కె ఓలెడ్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ టివిలో 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో,16 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 లకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ టివి ఓఎస్‌ను ఏర్పాటు చేసినందున ఈ టివిలలో గూగుల్ అసిస్టెంట్ కూడా లభిస్తున్నది. 55 ఇంచుల మోడల్ రూ.3,99,990 ధరకు లభిస్తున్నది. 65 ఇంచుల మోడల్ ధర రూ.5,59,990 గా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ టివిలను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.