Saturday, April 20, 2024

త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ

- Advertisement -
- Advertisement -

 poultry policy

 

సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు. చికెన్‌పై దుష్ప్రచారాలు, అపోహలు నమ్మొద్దన్నారు. ఎగ్, చికెన్, మటన్, ఫిష్ వేటికీ కరోనా లేదని, మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతకనే బతకవన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు తమ కుటుంబ సభ్యులందరం రోజు చికెన్ తింటామని చెప్పారు.

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆలిండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సంయుుక్తంగా నిర్వహించిన ‘చికెన్ అండ్ ఎగ్ మేళా’ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. పౌల్ట్రీ ఇండస్ట్రీపై మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు పండించే రైతులు ఆధారపడి ఉన్నారని, వారిని డీలా పరిచేలా తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు.

దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీని త్వరలోనే తీసుకోస్తామన్నారు. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ రైతులకు బాసటగా నిలుస్తోందని తెలిపారు. పలు రంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం చికెన్, గుడ్లు పంపిణీ చేస్తోందని, కరోనా వైరస్‌కు చికెన్, గుడ్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చికెన్ ద్వారా కరోనా వస్తుందనేది అపోహ మాత్రమేనన్నారు.

కరోనా వైరస్ 20డిగ్రీల సెల్సియస్ లోపే బతుకుతుందని తెలిపారు. అలాగే, పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వ మద్దతు ఉందని చెప్పటానికే ఈ మేళాకు వచ్చినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు చికెన్‌తో పాటు గుడ్లు తిన్నారు. చికెన్, ఎగ్ మేళాకు నగరవాసులు భారీ ఎత్తున తరలివచ్చారు.

Soon an excellent poultry policy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News