Wednesday, April 24, 2024

త్వరలో బియ్యం, నగదు పంపిణీ

- Advertisement -
- Advertisement -

cs somesh kumar

 

మన తెలంగాణ/హైదరాబాద్ : నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. అధిక ధరలు లేకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. పుకార్లు, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు. ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బియ్యం, నగదు పంపిణీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీఎస్ తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉండి నిబంధనలు ఉల్లంఘించిన 350కి పైగా వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్‌లోకి తరలించామని.. అవసరమైతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు అమలు చేస్తోందన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు.

 

Soon rice and cash disbursements
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News