Friday, March 29, 2024

నటుడు నాగశౌర్య ఫాంహౌస్‌పై ఎస్‌వొటి దాడులు

- Advertisement -
- Advertisement -

SOT police Attack on actor Naga Shourya Farm House

పేకాటా ఆడుతున్న 30మంది రియాల్టర్ల అరెస్ట్
రూ.25 లక్షల నగదు,33 సెల్‌ఫోన్లు,3 కార్లు స్వాధీనం

హైదరాబాద్: నగర శివారులోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువ హీరో నాగశౌర్య లీజుకు తీసుకున్న విల్లాపై ఆదివారం నాడు ఎస్‌వొటి పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 30మంది రియాల్టర్లను అరెస్ట్ చేయడంతో పాటు రూ. 25లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా నాగశౌర్య లీజుకు తీసుకున్న విల్లాలో 30 మంది రియల్టర్లతో పేకాట ఆడిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌వొటి పోలీసులు దాడి చేశారు. ఈక్రమంలో రూ.25 లక్షల నగదు , 33 సెల్‌ఫోన్లు, 3 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా పేకాట ఆడిస్తున్న ప్రధాన నిర్వాహకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా ఆరు నెలల క్రితం యువ హీరో నాగశౌర్య నార్సింగిలో విల్లాను అద్దెకు తీసుకున్నారు.

అయితే విజయవాడ, కర్నూల్, – నిజామాబాద్-, మహబూబా బాద్ జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో పాటు మరో 5గురు పేకాట ఆడుతున్నట్లు ఎస్‌వొటి పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే దాడులు నిర్వహించిన నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఈ విల్లా ఒక ఐఏఎస్ అధికారికి చెందినదని, అయితే నాగశౌర్య ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లీజుకు తీసుకున్న విల్లాలో నాగశౌర్య వీకెండ్‌లలో తెలంగాణ, ఎపిలోని ప్రముఖులు పేకాట ఆడుకునేందుకు ఇస్తున్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కాగా సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం నిర్వాహకుడు విల్లా అద్దెకు తీసుకున్నాడని, విల్లాలో తరచూ పేకాట క్లబ్ ను సుమంత్ చౌదరి నిర్వహిస్తున్నట్లు పోలీసులు విచారణ వెల్లడైంది. ఈక్రమంలో సుమంత్ చౌదని వెనుక ఎవరెవరున్నారన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News