Home తాజా వార్తలు దక్షిణాఫ్రికా రండి

దక్షిణాఫ్రికా రండి

South Africa

 

మంత్రి కెటిఆర్‌కు సౌతాఫ్రికా టిఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు నాగరాజు ఆహ్వానం

హైదరాబాద్ : దక్షిణాఫ్రికా దేశాన్ని ఒక సారి సందర్శించాలని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ను ఆ దేశం టిఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ప్రగతిభవన్‌లోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కెటిఆర్‌ను నాగరాజు, సౌత్ ఆఫ్రికా ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రధాన కార్యదర్సి మేడసారి నరేంద్రర్‌రెడ్డిలు కలిసి విజ్ఞప్తి చేశారు. గత సంవత్సర కాలంగా సౌత్ ఆఫ్రికాలో టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ పక్షాన చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలు, సేవలను వారు కెటిఆర్‌కు వివరించారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ విభాగం చేపట్టిన పనుల వివరాలకు సంబంధించిన రూపొందించిన మ్యాగజైన్‌ను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఎన్‌ఆర్‌ఐ విభాగం చేస్తున్న పనుల పట్ల కెటిఆర్ అభినందించారు. ఇదే స్పూర్తితో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు.

South African TRS Department invites Minister KTR