Home బిజినెస్ విశాఖలో సదరన్ ట్రావెల్స్ నూతన కార్యాలయం

విశాఖలో సదరన్ ట్రావెల్స్ నూతన కార్యాలయం

SOTHERN-TRAVELS

హైదరాబాద్: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన సదరన్ ట్రావెల్స్ నూతన కార్యాల యాన్ని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిం చారు. కార్యక్రమం లో స్థానిక పార్లమెంటు సభ్యులు కె.హరిబాబు, వి.గణేష్ కుమార్, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.శ్రీజన, నాగార్జున యూనివర్సిటీ మాజీ విసిడాక్టర్ వి.బాలమోహన్ దాస్, రాయలసీమ యూనివర్సిటీ మాజీ విసి డాక్టర్ జె.వి.ప్రభాకర రావు, ఫార్చూన్ ఇన్ శ్రీ కన్య ఛైర్మన్ కేతవర పు దేవల్లు, సదరన్ ట్రావెల్స్ ఛైర్మన్ ఆలపాటి వెంకటేశ్వర రావు, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్, జాయింట్ మేనే జింగ్ డైరెక్టర్ ఎ.వి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.టూర్లు నిర్వ హించడంలో 47 సంవత్సరాల అనుభవమున్న సదరన్ ట్రావెల్స్ గత 8 సంవత్సరాలుగా వరసగా దేశీయ ఉత్తమ టూర్ ఆపరేటర్‌గా నేషనల్ టూరిజం అవార్డును పొందింది. పర్యాటక రంగానికి అందించిన సేవలకు గాను ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుండి ఉత్తమ టూర్ ఆపరేటర్ అవార్డును స్వంతం చేసుకుంది. ఛార్‌ధామ్, వారణాసి, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్, సిక్కిం, గోవా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా అమెరికా, ఐరోపా, సింగపూర్, థాయ్ల్‌ం డ్, మలేసియా, దుబాయ్, శ్రీలంక తదితర దేశాల్లో విదేశీ టూర్స్ నిర్వహిస్తోంది. ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. అన్ని ప్యాకేజీలకు డీలక్స్ హోటళ్లలో వసతి, శాకాహారం, ఎసి కోచ్‌లలో రవాణా సౌకర్యం కల్పించడం సదరన్ ట్రావె ల్స్ ప్రత్యేకత. యాత్రికులకు నిరంతర సేవలందిం చేందుకు ఈ సంస్థకు దేశవ్యాప్త యంత్రాంగం ఉంది. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్,వరంగల్, బెంగు ళూరు, చెన్నై, కోయంబత్తూరు, ముంబయి, జైపూర్ నగరాలలో సంస్థ శాఖలతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని కార్పోరేట్ ఆఫీస్ ద్వారా యాత్రికులకు సేవలు అందిస్తోంది.