Home జాతీయ వార్తలు కాంగ్రెస్‌కు రెండు.. మాకు చెరో 38 సీట్లు

కాంగ్రెస్‌కు రెండు.. మాకు చెరో 38 సీట్లు

Akhiles Yadav and Mayawatiలోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌పి-బిఎస్‌పి పొత్తు

లక్నో: మరి కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమ రెండు పార్టీల మధ్య కుదిరిన సీట్ల పొత్తును సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి శనివారం ప్రకటించారు. ఎస్‌పి, బిఎస్‌పి చెరో 38 స్థానాలలో పోటీ చేస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు, ఇతర మిత్రపక్షాలకు 2 స్థానాలను వదిలిపెడుతున్నామని వారిద్దరూ తెలిపారు.

అఖిలేష్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాయావతి ఎస్‌పి-బిఎస్‌పి కూటమి ప్రధాని మోడీకి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయని చెప్పారు. కాగా, 2017లో ఇదే వేదికపై నుంచి అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బిజెపి యుపిలోని మొత్తం 403 స్థానాలలో 312 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.

SP-BSP announce Tie-up, Both parties will contest 38 LS each while leaving Cong 2 and other allies 2 seats