Friday, January 27, 2023

షూతో కొట్టుకొని క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి

- Advertisement -

MLA-Beats-With-Shoeబులందర్‌షహర్ : ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు వివిధ రకాల వాగ్ధానాలు ఇస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం ప్రచారంలో ఓటర్లను క్షమాపణలు కోరుతూ తనని తాను షూతో కొట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షుజాత్ ఆలమ్ వృత్తిరీత్యా లాయర్. అంతకు ముందు రెండు సార్లు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి బిఎస్‌పి అభ్యర్థి హజీఅలీంపై పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగ సమయంలో ‘తెలీక ఏమైన తప్పులు చేసి ఉంటే మన్నించండి’ అంటూ షూతో కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై ఆ పార్టీ స్పందించకపోవడం గమనార్హం.

https://youtu.be/Bju6NvIPVSw

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles