Home అంతర్జాతీయ వార్తలు అంతరిక్షంలో ప్రైవేటు అడుగు

అంతరిక్షంలో ప్రైవేటు అడుగు

SpaceX propels two NASA astronauts into orbit

 

తొలిసారి ‘స్పేస్ ఎక్స్’ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఐఎస్‌ఎస్ చేరిన వ్యోమగాములు

కేపె కెనవెరాల్ : ఇద్దరు అమెరికన్లతో స్పేస్ ఎక్స్ రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిసింది. అంతరిక్ష యానంలో ఇదో కొత్త అధ్యాయం. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ నుంచి మనుష్యులను రోదసీలోకి పంపించడం జరిగింది.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు మానవ సహిత క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అంతరిక్షంలోకి మానవుడిని తీసుకువెళ్లడం ఇదే మొదటిసారి అయింది. ఇకపై అంతరిక్ష ప్రైవేటు సంస్థలు మనుష్యులను అంతరిక్షంలోకి పంపించే నూతన ప్రక్రియ ఏర్పడనుంది. దాదాపు 19 గంట ల ప్రయాణం తరువాత ఈ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) విజయవంతంగా చేరుకున్నారు. భూమికి అంతరిక్షానికి దూరాలను చెరిపివేసే అమెరికా ప్రయోగాల దశలో ఇదో కీలకమైన ముందడుగుగా విశ్లేషిస్తున్నారు.

అమెరికా వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రలలో ఈ ఘట్టం కీలకమైనదని తెలిపారు. ఓ దశాబ్దం తరువాత అమెరికా నేల నుంచి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం ఇదే తొలిసారి. నాసాలో తగు రీతిలో శిక్షణ పొందిన డౌ హర్లే, బాబ్ బెహెంకెన్‌లు చారిత్రాత్మక ప్రయోగకేంద్రం నుంచి జరిగిన ప్రయోగంలో రోదసీలోకి దూసుకువెళ్లారు. ఈ ఇరువురు వ్యోమగాములు సురక్షిత కక్షలోకి వెళ్లినట్లు నిర్థారణ అయింది. 19 గంటల అంతరిక్ష ప్రయాణం తరువాత ఇరువురు ఐఎస్‌ఎస్‌కు ఆదివారం చేరుకున్నారు. అక్కడ నాలుగు నెలలు ఉంటారు. ఈ అంతరిక్ష ప్రయోగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కరోనా వైరస్ విజృంభణ దశలోనే నింగిలోకి మనుష్యులకు పంపే అద్భుత ఘట్టం ఆవిష్కృ తం అయింది.

SpaceX propels two NASA astronauts into orbit