Friday, April 19, 2024

కరోనాకు ఫుట్‌బాల్ కోచ్ బలి

- Advertisement -
- Advertisement -

మలాగ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మరి స్పెయిన్‌కు చెందిన యువ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా (21)ను బలి తీసుకుంది. కొంతకాలంగా గార్సియా కరోనాతో బాధపడుతున్నాడు. ఒకవైపు కరోనా మరోవైపు లుకేమియా వెంటాడంతో గార్సియా అర్ధాంతరంగా ప్రాణాలు విడవక తప్పలేదు. గార్సియా స్పెయిన్‌కు చెందిన అట్లెటికొ సాకర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గార్సియా చిన్న వయసులోనే ప్రతిభావంతుడైన కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని పర్యవేక్షణలో అట్లెటికొ మంచి జట్టుగా పేరు తెచ్చకుంది.

కాగా, కొన్ని రోజులుగా స్పెయిన్‌లో కరోనా భూతం తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీనికి స్పెయిన్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు. తాజాగా యువ ఫుట్‌బాల్ కోచ్ గార్సియా కూడా కరోనా కోరల్లో చిక్కుకుని తుది శ్వాస విడిచాడు. గార్సియా మరణం వార్తను అతని ఫుట్‌బాల్ క్లబ్ అట్లెటికొ ట్వీటర్ ద్వారా వెల్లడించింది. కాగా, గార్సియా మృతిపై స్పెయిన్‌కు చెందిన పలువురు ఫుబాబాల్ స్టార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Spanish Football Coach died due to Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News