Home జయశంకర్ భూపాలపల్లి అదృష్టవంతులు మీరే: స్పీకర్ సిరికొండ

అదృష్టవంతులు మీరే: స్పీకర్ సిరికొండ

Speaker Speech About higher Studys In Jayashankar Dist
మనతెలంగాణ/చిట్యాలః ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు చక్కగా చదువుకొని ఉపాద్యాయులకు,తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకరావాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిగాంధీ విద్యాలయంలో ఇంటర్ మీడియట్ తరగతులు ప్రారంభించారు.అనంతరం పిల్లలకు పెడుతున్న మేను చాట్‌ను చూసి అనందం వ్వక్తం చేశారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులు అని అన్నారు. మాకాలంలో చదుకుందామంటే సరైనా పాఠశాలలు లేవు,చదువుకునే వారులేరు,చదువించే తల్లిదండ్రులులేక అనేక ఇబ్బందు పడేవారమని ఐనా చక్కగా చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. మీరు అలా కాకుండా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక్కోక్క విద్యార్థికి ప్రతి యెటా లక్ష ఇరవై వేల రుపాయాలు ఖర్చు చేస్తు చదివిస్తుందని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని అన్నారు. మీ జీవితం మీ చేతుల్లో ,చేతల్లో ఉందని అన్నారు. ప్రపంచంలో పోటి పడె విధంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరి విద్యను అందిస్తుందని పేర్కోన్నారు.

విశ్వంలో జీవం ఉందని తెలుసుకోవడంలొ ముగ్గురు మాత్రమే ఉన్నారని వారిలో ఒక సైంటిస్ట్,ముఖ్యమంత్రి కెసిఆర్,మరోకరు స్పీకర్ మధుసూధనాచారిఅని అన్నారు. జీవితంలో ఒకరు ఎదుగుతు వస్తారు,మరోకరు ఎగురుతు వస్తారు అని పేర్కోన్నారు.గత100 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరుపేద కుటుంబంలో పుట్టి భారత రాజ్యంగం రాసాడని అలాంటి మహానియున్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఒక అంబేద్కర్‌లాగా తయారు కావాలని కోరారు.మీరు అంబేద్కర్‌లగా తయ్యారు అయితే మీకు నేనుసేపరాసినై పుట్టాలని అభగవంతున్ని కోరుకుంటానని అన్నారు మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు ఒక మారుమూల గ్రామంలో పుట్టి దేశ ప్రధానిగా ప్రజలకు సేవలు అందించిన మహా గోప్పనాయకుడని ఎన్నో భాషలు మాట్లాడగలిగే గొప్ప మేధవి అని అన్నారు.విద్యార్థులు చక్కగా చదువుకుని అద్పుతంగా రాణించాలని అశ్వీరదించారు .అనంతరం పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగాంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రంలో డిఇవో శ్రీనివాస్ రెడ్డి, యంఇవో కొడెపాక రఘుపతి, ఎస్‌వో సుమలత,ఎయంవో మనోహర్,జిసిడివో నిర్మల,పరకాల మార్కెట్ చైర్మన్ కుంభం రవీందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కర్రె ఆశోక్‌రెడ్డి,సర్పంచ్ పుల్లూరి రమాదేవిసతీష్,నాయకులు ఆరెపల్లి మల్లయ్య,గణపతి,పిట్టల సుధాకర్,జన్నే యుగేందర్,కొడెల రాయమల్లు చిలుముల రమణాచారి, రవీందర్ రెడ్డి,శ్రీనివాస్ రావు,కత్తి సంపత్, కట్కురి రాజేందర్,కోటి,అరెపల్లి రాజుకుమార్,తదితరులు పాల్గోన్నారు.