Home తాజా వార్తలు మైనార్టీల రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిటీ : కెసిఆర్

మైనార్టీల రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిటీ : కెసిఆర్

CM-KCR-Iftar-1హైదరాబాద్ : రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం మాట్లాడారు. ఈ ఏడాది 120 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మైనార్టీల రిజర్వేషన్ల కోసం కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఢిల్లీకి పంపుతామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధఃగా మైనార్టీలకు అధిక నిధులు కేటాయించామని గుర్తు చేశారు.