Tuesday, April 23, 2024

నగర రోడ్లపై.. విచ్చలవిడిగా డ్రైవ్ స్పెషల్ బైక్స్

- Advertisement -
- Advertisement -

Special drive bikes that without permission

 

మన తెలంగాణ , హైదరాబాద్ : నగర రోడ్లపై అనుమతి లేకుండా తిరుగుతున్న‘ డ్రైవ్స్ స్పెషల్ బైక్స్’ తిరుగుతున్న ద్విచక్రవాహనాలపై రవాణాశాఖ అధికారులు దృష్టి పెట్టక పోవడంతో సంస్థ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతోంది. నగరంలో నాలుగైదు సంస్థలు డ్రైవ్ స్పెషల్ బైక్స్‌తో ద్విచక్ర వాహనాలను గంటలు, రోజుల చొప్పున అద్దె ప్రాతిదికన ఇస్తున్నాయి. ఆయా సంస్థలకు కేవలం 10 నుంచి 15 వాహనాలకు మాత్రమే రవాణాశాఖ అనుమతి పోందుతూ అనుమతి లేకులండా 100కు పైగా ద్విచక్రవాహనాలను వాహనదారులకు అద్దెకు ఇస్తున్నాయి. వాస్తవానికి సాధారణ వాహనాలు రవాణాశాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తెలుపు నెంబర్ ప్లేట్‌లను ఆయా వాహనాలకు అందచేస్తారు. కాని అద్దె ప్రాదికపై తిరిగే వాహనాలకు పసుపు రంగు ప్లేట్లను రవాణాశాఖ అందచేస్తోంది. అయితే నిబంధనలు పాటించిన సంస్థలపై పొరుగున ఉన్న కర్నాటక ప్రభుత్వం ఆరు నెలల పాటు ఆయా సంస్థలపై నిషేదం విధించింది. ఇంత జరుగుతున్నా ఇక్కడి అధికారులు మాత్రం వీటిని పట్టించు కోకుండా ఆయా సంస్థల సేవల్లో తరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యాపారాన్ని పెంచుకోవడమే లక్షంగా పని చేస్తున్న ఆయా సంస్థలు వాటిని వాహన దారులకు ఇష్టం వచ్చినట్లుగా ఇస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా మైనర్లకు కూడా కూడా అద్దె ప్రాతిపదికనన వాహనాలు అందచేస్తుండంతో వారు తరుచు ప్రమాదాలబారిన పడుతున్నారు. కొన్ని సంస్థలు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ఇస్తున్నా మరి కొన్ని సంస్థలు మాత్రమే వాటిని ఏ మాత్రం పట్టించు కోకుండా వాహనాలను అప్పగిస్తున్నాయి. దాంతో ఆయా వాహనాలను వారు అసాంఘిక కార్యకలపాలకు వినియోగించుకుంటున్న సందర్భంలో వారిపై కేసులు నమోదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో సాధారణ సైకిల్‌ను అద్దెకు ఇవ్వాలంటే సదరు వ్యక్తికి సంబంధిం ఎవరైనా తెలిసిన వారు ఉంటేనే ఇచ్చేవారు.

కాని ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. వ్యాపారం పెంచుకోవడమే లక్షంగా పని చేస్తున్న కొన్ని సంస్థలు కేవలం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వారికి సంబంధించిన ఎటువంటి వివరాలను తెలుసుకోకుండానే వాహనాలను అప్పగిస్తుండటంతో వారు వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం బైక్స్‌ను మాత్రమే కాకుండా కార్లను కూడా కొన్ని సంస్థలు గంటలు , రోజుల ప్రాతిపదికన అద్దెకు ఇస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నాయని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దిన్ తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News