Saturday, March 25, 2023

విలీన మండలాల సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక చొరవ

- Advertisement -

 

harish

* మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్ధిపేట : నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా సిద్దిపేట జిల్లాలో విలీనమైన చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి మండలాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. చేర్యాల, మద్దూరు, కొమురవెళ్లి మండలాల్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ బోడికుంటి వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం మంత్రి పర్యటించారు. పర్యటనలో భాగంగా చేర్యాల మండల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతుల పై ఆరా తీయడంతో పాటు నూతనంగా చేపట్టనున్న ప్రభుత్వ కార్యాలయాల నిరాణాల సముదాయానికి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ మండల కార్యాలయాలను ఒకే గొడుగు కింద ఏర్పాటు చేసేందుకు రూ.17కోట్ల నిధులను మంజూరు చేశామని, ఈ భవన సముదాయ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ భవన ఏ ర్పాటుతో చేర్యాల మండల ప్రజలకు తక్కువ సమయంలో ప్రభుత్వ సేవలు అతిసులభంగా అందుతాయన్నారు. తర్వాత మంత్రి మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్మించిన టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది వరకే మండల కేంద్రంలో నూతన రైతు బజారు నిర్మాణానికి, పెద్దచెరువును మినీట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు, మార్కెట్ యార్డులో గిడ్డంగుల నిర్మాణానికి నిధులు మం జూరు చేశామని, వాటి పనులను వేగవంతం చేయాలని అన్నారు. మండల కేంద్రం గుండా వెళ్లి ప్రధాన రహదారిని ఆధునీకరించి, వారం రోజు ల్లో దుమ్ము, ధూలి నుంచి  పజలకు ఊరట కలిగిస్తామని పేర్కొన్నారు. అనంతరం దొమ్మాట గ్రామంలో డబుల్‌బెడ్‌రూంల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపిపి మేడిశెట్టి శ్రీధర్, సర్పంచ్ ముస్తాల అరుణాబాల్ నర్సయ్య, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షుడు బందెల మహిపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు సుంకరి మంల్లేశంగౌడ్, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, శివగారి అంజయ్య, మంగోలు చంటి, బండోజు భాస్కర్, ఎంపిటిసిలు కొమ్ము నర్సింగరావు, శివగారి నర్సింహులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News