Home Default ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు : కెటిఆర్

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు : కెటిఆర్

Minister KTRహైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్‌లో మెహిదీపట్నం నుంచి ఖాజాగూడ రహదారిలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణకు నగర ప్రజలు విధిగా సహకరించాలని ఆయ కోరారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కావడంతో ఖాజాగూడ నుంచి మైండ్‌స్సేస్ వైపు వెళ్లే వాహనదారులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన చెప్పారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టినట్టు ఆయన తెలిపారు. రూ.69.47కోట్ల వ్యయంతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ మూడు లేన్ల ఫ్లైఓవర్‌తో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు పరిష్కారమవుతాయని కెటిఆర్ వెల్లడించారు. ఈ మార్గంలో ప్రస్తుతం గంటకు 14వేలకుపైగా వాహనాలు నడుస్తున్నాయని, 2035నాటికి వీటి సంఖ్య రెట్టింపవుతుందని అంచనావేసి ఈ ఫ్లైఓవర్‌ ను నిర్మించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్‌తో తదితరులు పాల్గొన్నారు.

Special Measures For Traffic Control : Minister KTR