Home తాజా వార్తలు ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలి

ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలి

Special Railway Budget

 

కేంద్రానికి ప్రజాసంఘాల డిమాండ్

హైదరాబాద్ : కేంద్రం ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలని రైల్వే ప్యాసింజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మరియు వివిధ కార్మిక, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం హైదరాబాద్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పార్లమెంట్ మాజీ సభ్యురాలు గుండుసుధారాణి, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ అధ్యక్షుడు యాదవరెడ్డి, ప్రొఫెసర్ ఇన్నయ్య, అరుణోదయ నాయకురాలు విమలక్క తదితరులు మాట్లాడుతూ ఆంగ్లేయుల కాలం నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను బిజెపి ప్రభుత్వం రద్దుచేసిందని తప్పుబట్టారు.

అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తమవంతు సహాయం చేయడంలేదన్నారు. విభజన హామీలమేరకు ఆంధ్రలో విశాఖ రైల్వేడివిజన్ పనులు ప్రారంభమైనప్పుడు తెలంగాణలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులను ఎందుకు కేంద్రం ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించడంతోపాటు తెలంగాణకు కొత్తరైల్వేలైన్లు, విభజన హామీల అమలుకు కేంద్రం కృషిచేయాలని వారు డిమాండ్ చేశారు.

Special Railway Budget must be revived