Wednesday, April 24, 2024

సమ్‌థింగ్ స్పెషల్‌గా…

- Advertisement -
- Advertisement -

Special song to release on Chiranjeevi's Birthday Aug 22

మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ప్రతి ఏడాది చిరంజీవి బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి డై హార్డ్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ప్రణాళికలు మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో ‘చిరు బర్త్‌డే ఫెస్ట్ బిగిన్స్’ హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఇప్పటికే సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్‌ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని 65 మంది సెలబ్రిటీల చేతుల మీదుగా రిలీజ్ చేయించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధంగా ఏ హీరో బర్త్ డేని సెలబ్రేట్ చేయలేదని చెప్పవచ్చు. ఇప్పటికే మెగాస్టార్ కామన్ మోషన్ పోస్టర్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీఎంపీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనేది త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇక రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆయనకి విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ’మెగాస్టార్స్ మెగా ర్యాప్’ పేరుతో విడుదల కానున్న ఈ పాటను ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నారు.

Special song to release on Chiranjeevi’s Birthday Aug 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News