Home తాజా వార్తలు రైతు కుటుంబం నుండి ప్రోబేషనరీ ఎస్‌ఐగా..

రైతు కుటుంబం నుండి ప్రోబేషనరీ ఎస్‌ఐగా..

Special story about Probationary SI Vadde Dileep

 

వరంగల్ : వారిది వ్యవసాయ కుటుంబం, అయితేనేం.. వారింట ధాన్యం రాసులకు తోడు ‘కొలువుల రాసులు’ పంట పండిది. వ్యవసాయమే జీవనాధారమైన ఆ రైతుకు ముగ్గురు కుమారులు, ఒక కూమార్తె కాగా అందరూ ఉద్యోగులే కావడం గమన్హాం. వీరిలో రెండవ కుమారుడైన వడ్డే దీలిప్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించడం మరో విశేషం. రైతు కుటుంబం నుండి ప్రోబేషనరీ ఎస్‌ఐగా వడ్డే దీలిప్ ఇల్లంతకుంట లో విధులు నిర్వర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే… వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కోండ గ్రామంలో వడ్డే మల్లయ్య-రమాదేవి దంపతులు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు.

ఈ దంపతుల రెండవ సంతానమే వడ్డె దీలిప్. మల్లయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు కుమారులను, కూతురును మంచి ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు వడ్డె సందీప్ బీటేక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో సాఫ్ట్ వేర్ కంపేనీలో జాబ్ చేస్తున్నాడు. రెండవ కుమారుడు వడ్డె సందీప్ ప్రస్తుతం ఇల్లంతకుంటలో ఎస్‌హెచ్‌ఓ హోదాలు ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడువ కుమారుడు ప్రదీప్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కూతురు శ్రావ్య పంచాయతీ కార్యదర్శిగా స్వంత జిల్లాలోనే ఉద్యోగం చేస్తుంది. ఒకే ఇంట్లో నలుగురు ఉద్యోగం చేస్తూ గ్రామంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఏడు ఉద్యోగాలను దాటి ఎస్‌ఐగా విధుల్లోకి…
దీలిప్ చిన్నప్పటి నుండి చదువులో ముందుండేవాడు. 1 నుండి 10వ తరగతి వరకు చెన్నరావు పేటలో, ఇంటర్ సివిరామన్ కాలేజ్‌లో, బీటేక్ హన్మకొండలో పూర్తిచేశాడు. పోటి పరీక్షలు రాయగా మొదటగా 2017 కానిస్టేబుల్ ఉద్యోగం విచ్చింది కానీ విధుల్లో చేరలేదు, తర్వాత 2018లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. 6 నెలల పాటు ఉద్యోగం చేసి మళ్లి చదవడం మొదలు పెట్టాడు. మళ్లి ఫారెస్ట్ శాఖలో ఎఫ్‌బిగా ఎంపికయ్యాడు, తర్వాత రైల్వే శాఖలో లోకో పైలేట్‌గా ఎంపియ్యాడు. కానీ రెండు ఉద్యోగాలకు వెళ్లకుండా మళ్లి పోలీస్ శాఖలో కోలువు కోసం వేచి చూశాడు. 2020 లో సివిల్ కానీస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలు రెండు ఒకే సారి వరించాయి. దీంతో సివిల్ ఎస్‌ఐ ట్రైనింగ్‌కు వెళ్లాడు. శిక్షణ పూర్తయ్యాక మొదటి సారిగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రోబేషనరి ఎస్‌ఐ విధుల్లో చేరాడు.

పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐ ని మా ఊరిలో రైతునే…
విధులు నిర్వర్తించే వరకు మాత్రమే ఎస్‌ఐని కానీ, మా ఊరిలోకి వెళ్తే నేను రైతునే. మా అమ్మనాన్నలు చాల కష్టపడి మమ్మల్ని చదివించారు. నేను ఇంటి వద్ద ఉన్నంత సమయం మా వ్యవసాయం చేసుకుంటు ఉండే వాడిని. పూర్తి స్థాయిలో వ్యవసాయం అవగాహన ఉంది. పోలీస్ శాఖ అంటే గౌరవం ఉంది, యువత పోలీస్ శాఖలో ఉద్యోగం ఆసక్తి చూపాలి. ప్రోబేషనరి సమయం పూర్తయ్యాక ఎక్కడ పోస్టింగ్ ఇచ్చిన విధులు నిర్వర్తిస్తాను.

Special story about Probationary SI Vadde Dileep