Home ఆఫ్ బీట్ శివోహం.. శైవ శోభితం

శివోహం.. శైవ శోభితం

lord-shiva

శివనామ స్మరణకు వేళాయే..
నగరంలో జాగరణకు ముస్తాబైన ఆలయాలు
ఆలయాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు
రంగురంగుల విద్యుత్ దీపాలతో విరాజిల్లుతున్న శివాలయాలు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి విశేషార్చనలు నిర్వ హించేందుకు నగరంలోని ప్రధాన శైవ క్షేత్రాలు ముస్తాబు అయ్యాయి. వివిధ ఆలయాల్లో మంగళవారం జరిగే కల్యాణోత్సవాలు, జాగరణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల జరిగే జాతర్లలో అన్నదానలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: మహా శివరాత్రి జాగరణలకు సర్వం సిద్ధ్దం అయింది. శివరాత్రి పర్వ దినం పురస్కరించుకుని శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. శివాలయాలన్ని విద్యుత్ దీపాలతో ఆలకరించారు. తెల్లవారు జాము న ఉదయం 3 గంటల నుంచే శివ పూజకు అన్ని ఏర్పాట్లను పూ ర్తి చేశారు. అభిషేకాలు, శివకళ్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, రుద్ర హోమం, పూర్ణాహుతి,  ఉత్సవమూర్తుల  ఊరేగింపులతో భక్తుల జాగరణకు పలు ఆలయా కమిటీలు ప్ర త్యేక ఏర్పాట్లను చేశారు. పాతబస్తీలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, పురానా పూల్ శివాలాల్ ఘాట్, చార్మీనార్ మహాదేవ్ మందిరం, కాచిగూడ వీరన్నగుట్ట శివాలయంతో పాటు మారేడ్‌పల్లిలోని సుబ్రమణ్యం దేవాలయ ప్రాంగణంలోని  శివాలయంతో పలు ఆలయాల్లో జాగరణకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ సమయంలో శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానుండడంతో  ఏలాం టి ఇబ్బందులు కల్గకుంగా ప్రత్యేక ఏర్పాట్లను ఆయా ఆలయ కమిటీలు పూర్తి చేశాయి. స్పటిక లింగ క్షేత్రమైన నాగోల్ సమీపంలోని శివపురి కాశీ విశ్వేశ్యరాలయం, సనత్ నగర్‌లోని హ నుమాన్ ఆలయ ప్రాంగణంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జున దేవాలయం, సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని స్కంధగ రి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. జాగరణలో భా గంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భజనలు, కీర్తనలు, ఒగ్గు కథలతో పాటు  భక్తి చిత్రాల ప్రదర్శనలను ఏర్పాటుకు సిద్ధం చేశారు. మరోవైపు ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన వేముల వాడ రాజ రాజేశ్వరి, కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వర స్వామి,, శ్రీశైలంలో మల్లికార్జున స్వామితో పాటు కొమురవెళ్లిలకు భాగ్యనగర వాసులు భా రీగా తరలి వెళ్లారు.