కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకుంటున్న యావత్ ప్రపంచం
హైదరాబాద్ : తెలంగాణ తెచ్చుడో కెసిఆర్ చచ్చుడో అంటూ టిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దీక్ష చేసి నటికి 11 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. 29 నవంబర్ 2009లో కెసిఆర్ చేసిన ఈ దిక్షను గుర్తుచేసుకుంటూ సాధించిన తెలంగాణలో దీక్షదివస్ నిర్వహిస్తూ ఆనాటి ఉద్యమాలను, త్యాగాలను టిఆర్ఎస్ పార్టీ నెమరు వేసుకుంటుంది. ఢిల్లీ పునాదులను కదిలించిన ఈదీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకింతం కావాలని ఎంఎల్‌సి కల్వకంట్ల కవిత ట్విట్టర్ వేదికగా పిలపునిచ్చారు. అలాగే ఆదివారం ప్రపంచంలోని పలుదేశాల్లో టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగాలు దీక్షా దివస్ నిర్వహించి అమరులై నేతలకు నివాళులు అర్పించారు. డెన్మార్క్‌లో దీక్షాదివస్ సందర్భంగా నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాటాలను స్మరిస్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఓటువేయాలని డెన్మార్క్ టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ వ్యవస్థాపధ్యక్షుడు శ్యామ్ ఆకుల హైదరాబాద్‌లోని తన బంధువులకు, స్నేహితులకు ఫోన్ ద్వారా కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రసాదరావు కలకుంట్ల, జయచందర్ గంట, విశాల్ వెంకట్‌శెట్టి, నరేందర్ రెడ్డి, ఎడమల, నరేందర్ రెడ్డి, బోళ్లసురేందర్ రావు కేసాని, శ్రీధర్ గెంట్యాల, సురేష్ కట్ట, దామోదర్ కనుకుల,కొండా రవి పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో తెలంగాణ రాష్ట్రసమితి న్యూజిలాండ్ దీక్షాదివస్‌ను నిర్వహించింది. సిఎం కెసిఆర్ ఆనాడు చేసిన దీక్ష ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని న్యూజిలాండ్ లోని ఎన్ఆర్ఐ విభాగం నాయకులు అనిజగన్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి కొసన పాల్గొన్నారు. అలాగే ఎన్జె ప్రాధానకార్యదర్శి అరుణ్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు రామారావు రోచకొండ, సునీత విజయ్, మోహన్‌రెడ్డి, పానుగంటి శ్రీనివాస్, ఆష్ వొదినాలస మౌనిక రావు, యాదవ్, రవీందర్ బొడ్డు తదితరులుపాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, నీటి నిపుణుడు విద్యాసాగర్ రావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.