Home తాజా వార్తలు తమిళ శిల్ప శైలీ వైభవ ద్వీపకల్ప గుడి

తమిళ శిల్ప శైలీ వైభవ ద్వీపకల్ప గుడి

Srirangapuram Ranganathaswamy Temple

శ్రీరంగాపూర్ రంగనాథాలయం

గుడిలోపల పూర్తిగా విజయనగర శైలిలో నిర్మించబడ్డది. ప్రదక్షిణాపథం, ప్రధాన గర్భగుడికి ఇరువైపుల రామాలయం, రామనుజాలయాలొకవైపు, చతుర్భుజురాలైన లక్ష్మీదేవి గుడి వుంది. ఈ దేవిని తాయారు అని కూడా పిలుచుకుంటారు. ఈ గుడికి పక్కన ఆళ్వారుల సన్నిధి, యాగశాల వున్నాయి. రంగనాథస్వామి దేవాలయానికి రంగమంటపం, అంతరాళం, గర్భగుడి వున్నాయి. జయ, విజయులిద్దరు చతుర్భుజులైన ద్వారపాలకులు. వీరికి ఉదరబంధాలున్నాయి గర్భగుడి రంగనాథుడు శయనించి వుండగా, శ్రీదేవి, భూదేవిలిద్దరు పాదసేవ చేస్తున్న విగ్రహాలున్నాయి.

అంతరాళం ప్రవేశద్వారం కళ్యాణీ చాళుక్యుల శైలిలో చెక్కివుంది. లలాటబింబంగా గజలక్ష్మి వుంది. లక్ష్మీదేవి చతుర్భుజి. వెనక చేతులలో తామరపుష్పాలు, ముందర కుడిచేయి అభయముద్రతో, ఎడమచేయి వరదహస్తంగా వున్నాయి. స్థూపకిరీటమున్న ఈ దేవతకు కుచబంధం కూడా వుంది. సాధారణంగా గజలక్ష్మికి వుండని ఈ అదనపు అలంకరణ తమిళనాట శిల్పశైలిగా కనిపిస్తున్నది. దేవాలయమంతా విజయనగర ఆర్కిటెక్చరే కనిపించినా, శిల్పసాంప్రదాయికత అంతా తమిళశిల్పుల పనితనమే కనిపిస్తున్నది. 18వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయంలోని రాతి స్తంభాలు కంచి, శ్రీరంగపట్నం వంటి వైష్ణవాలయాలలో వలె ఎత్తైన స్తంభాలతో ప్రదక్షిణాపథం, స్తంభాలపై యాళీలు అందంగా తీర్చదిద్దబడ్డాయి.

వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన వైష్ణవ దేవాలయం రంగనాథాలయం శ్రీరంగాపురం చెరువులో ద్వీపకల్పంలా వున్నది. ఈ దేవాలయం గరుడాద్రిపై నిర్మించబడిందని, స్వామివారిని గరుడాద్రిధామ అని పేర్కొన్నది దేవాలయ శాసనం. అష్టభాషి, బహిరీ బిరుదాంకితుడు, రామచంద్రోదయం, శృంగారమంజరిలను రచించిన కవి, పండితుడు సంస్థానాధీశుడు గోపాలరాయ భూపాలుడు శ్రీరంగాపురం ఆలయ నిర్మాణానికి కారకుడు. 1662లో శ్రీరంగపట్నంలో రంగనాయకుని దేవాలయం చూసి, అటువంటి గుడిని తమ సంస్థానంలో కట్టించాలనుకున్నాడు.

పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని సంస్థానాలలో వనపర్తి సంస్థానం ఒకటి. ఈ సంస్థానం 450 చ. కి.మీ.లలో విస్తరించి వుండేది. 1901లో సంస్థానం రెవెన్యూ రూ.1.5 లక్షలుండేది. అందులోనుంచి 76వేల 883 రూపాయలు నిజాముకు చెల్లించే కప్పంగా వుండేది. వనపర్తి సంస్థానానికి మొదటి పేరు సూగూరు సంస్థానం. తొలి రాజధానిగా సూ గూరు వుండేది. ఈ సంస్థాన పరిపాలకుడు మొ దటి రామకృష్ణారావు సూగూరు నుంచి రాజధానిని వనపర్తికి మార్చడం వల్ల సంస్థానం పేరు మా రిపోయింది. అప్పటి నుంచి ఇది వనపర్తి సం స్థానం. ఈ సంస్థానాధీశుల మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి. వీరకృష్ణభూపతి(1517-1540)గా పి లువబడిన ఈ రాజు తొలినివాసం కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా జనుంపల్లి. విజయనగర రాజుల కాలంలో రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాడు వీరకృష్ణారెడ్డి.జనుంపల్లి నుంచి పానుగల్లు పరిసరాల్లోని పాతపల్లి గ్రామానికి వలసవచ్చి చుట్టు 6గ్రామాలను స్వాధీనపరచుకున్నాడట వీరకృష్ణారెడ్డి. సూగూరు దేశాధిపతిగా పేరుపొందాడు. ఈ సంస్థానాధీశుల ఇంటిపేరు జనుంపల్లి.

వీరకృష్ణారెడ్డికి నాలుగోతరం వారసుడు వేముడి వెంకటరెడ్డి. గొప్పవీరుడని చెపుతారు. వెంకట రెడ్డి కొడుకు గోపాలరావు ‘అష్టభాషి, బహిరీ’ అనే బిరుదులు పొందాడు. గోపాలరావు రంగనాథాలయంలో నిత్యోత్సవాది కైంకర్యాలు చేయించాడు. మొదటి రామకృష్ణారావు దత్తపుత్రుడు రాజా రామేశ్వరరావు భార్య రాణీ శంకరమ్మ(రాణీ శంకరాంబ) ఆలయాన్ని విస్తరింపచేసింది. అనేకమంది దేవత విగ్రహాలను ప్రతిష్టింప జేసింది. దేవాలయ గోపురం నిర్మింపచేసింది. ఆ తర్వాత వనపర్తి సం స్థానాన్ని 1920 వరకు పాలించిన 2వ రామేశ్వరరావు ఆలయాన్ని విస్తరింపజేసాడు. వైష్ణవ ఆళ్వార్లకు గుడులు, రామానుజాలయం, భాష్యకార్లకు గుడులు, మనవాళ మహాముని గుడి నిర్మాణాలు చేయించాడు. ఇతని కొడుకు కృష్ణదేవరాయలు పేరిట రంగసముద్రం(చెరువు) నడుమ రాతిగట్టుపై కృష్ణవిలాస్ అనే విశ్రాంతి భవనం నిర్మింపబడ్డది.

బ్రిటిష్ రెసిడెన్సీ వనపర్తి సంస్థానానికి వచ్చినపుడు ఇందులోనే విడిది చేయించేవారట. 3వ రామేశ్వరరావు కృష్ణదేవరాయలు కొడుకు. ఇతని దత్తపుత్రుడు కృష్ణదేవరావు ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. దేవాలయంలోనికి ప్రవేశించే గోపురద్వారానికి కుడిపక్కన గోడమీద ఆలయానికి సంబంధించిన శాసనం వుంది. ఈ శాసనం మీద మొదట తిరునామానికి కుడివైపు చక్రం, సూర్యుడు, ఎడమవైపు శంఖం, చంద్రుడు వున్నారు. స్వస్తిశ్రీ రంగనాథాయ అని మొదలవుతుంది శాసనం. ఈ శాసనం శాలివాహన శక సం. 1804, చిత్రభాను నామ సం. మార్గశిర మాసంలో అంటే క్రీ.శ. 1882 డిసెంబర్ లో వేయబడింది. ఈ శాసనాన్ని ప్రత్యగ్రదుర్గపుర కృష్ణకవి రచించాడు. శాసనభాష సంస్కృతం.లిపి తెలుగు. శ్రీరంగాపురం రంగనాథదేవాలయం రంగసముద్రం అనే చెరువులోనే వుండేది. వర్షాకాలంలో పడవలమీద గుడికి వెళ్తుండేవారు. ఇపుడు ఈ గుడి 3వైపుల నీరుతో ద్వీపకల్పంగా మార్చబడింది.

ఈ గుడికి ప్రవేశద్వారం మీద పంచతల గోపురం నిర్మించబడ్డది. నిర్మించిన కోయంబత్తూరు భక్తుడు తన బొమ్మను ప్రవేశద్వారం గడపదాటేచోట లోపలివైపు చెక్కించుకున్నాడు. ప్రధానదేవాలయ గోపు రం త్రితల గోపురం. ప్రవేశద్వారం వద్ద గోపురం అధిష్టానం మీద రామాయణ కథాదృశ్యాలు చెక్కించబడ్డాయి. ద్వారానికి లోపలివైపు కుడివైపున రా మానుజార్యుని ఉల్బణ శిల్పం, పక్కన శాసనం, ఎడమవైపున శ్రీరామపట్టాభిషేకం చెక్కబడింది. శతృఘ్నుడు చామరంతో, భరతుడు ఛత్రంతో సీతా, రామ, లక్ష్మణులు, రాముని పాదాల వద్ద హనుమంతుణ్ణి చెక్కారు. ప్రవేశద్వారం దాటిగానే నడవా, పక్కన చిన్న గార్డెన్ అందులో చతుర్భుజుడు, వెనక చేతులలో చక్రం,శంఖాలతో ముందు రెండు చేతులతో మురళిని వాయిస్తున్న వేణుగోపాలస్వామి దేవేరులు భూదేవి, శ్రీదేవిలతో కనిపించాడు.

వేణుగోపాలస్వామి ద్విభుజుడు, వేణువుతో కనిపిస్తాడు సహజంగా. మెదక్ జిల్లా కుకునూరులో కనిపించినట్టు ఇక్కడ కూడా ఈ స్వామి శంఖు, చక్రాలతో కనిపించడం మధ్వ సంప్రదాయపు వైష్ణవ దేవాలయాల ప్రత్యేకత. విష్ణురూపంలోనే వున్నాడు వేణుగోపాలుడు. భద్రాచలంలో, యాదగిరిగుట్ట పక్కన సైదాపురం గుట్టమీద రా ముడు శంఖు, చక్రాలతోనే కనిపిస్తారు. చివరికి ఫణిగిరి రామాలయంలో హనుమంతుడు సైతం చతుర్భుజుడై శంఖు,చక్రాలతో కనిపించడం వైష్ణవ సాంప్రదాయికతే.గుడిలోపల పూర్తిగా విజయనగర శైలిలో నిర్మించబడ్డది. ప్రదక్షిణాపథం, ప్రధా న గర్భగుడికి ఇరువైపుల రామాలయం, రామనుజాలయాలొకవైపు, చతుర్భుజురాలైన లక్ష్మీదేవి గుడి వుంది. ఈ దేవిని తాయారు అని కూడా పిలుచుకుంటారు. ఈ గుడికి పక్కన ఆళ్వారుల సన్నిధి, యాగశాల వున్నాయి. రంగనాథస్వామి దేవాలయానికి రంగమంటపం, అంతరాళం, గర్భగుడి వున్నాయి. జయ, విజయులిద్దరు చతుర్భుజులైన ద్వారపాలకులు.

వీరికి ఉదరబంధాలున్నాయి గర్భగుడి రంగనాథుడు శయనించి వుండగా, శ్రీదేవి, భూదేవిలిద్దరు పాదసేవ చేస్తున్న విగ్రహాలున్నాయి. అంతరాళం ప్రవేశద్వారం కళ్యాణీ చాళుక్యుల శైలిలో చెక్కివుంది. లలాటబింబంగా గజలక్ష్మి వుంది. లక్ష్మీదేవి చతుర్భుజి.వెనక చేతులలో తామరపుష్పాలు, ముందర కుడిచేయి అభయముద్రతో, ఎడమచేయి వరదహస్తంగా వున్నాయి. స్థూపకిరీటమున్న ఈ దేవతకు కుచబంధం కూడా వుంది. సాధారణంగా గజలక్ష్మికి వుండని ఈ అదనపు అలంకరణ తమిళనాట శిల్పశైలిగా కనిపిస్తున్నది. దేవాలయమంతా విజయనగర ఆర్కిటెక్చరే కనిపించినా, శిల్పసాంప్రదాయికత అంతా తమిళశిల్పుల పనితనమే కనిపిస్తున్నది. 18వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయంలోని రాతి స్తంభాలు కంచి, శ్రీరంగపట్నం వంటి వైష్ణవాలయాలలో వలె ఎత్తైన స్తంభాలతో ప్రదక్షిణాపథం, స్తంభాలపై యాళీలు అందంగా తీర్చదిద్దబడ్డాయి.

16వ శతాబ్దంలో తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున వైష్ణవ మతవ్యాప్తికై కృషిచేసిన వారివల్ల పలుచోట్ల వైష్ణవాలయాలు నిర్మించబడ్డాయి. వైష్ణవమతం స్వీకరించిన పాలకుల రాజపోషణలో ఇటువంటి దేవాలయాలు కట్టించబడ్డాయి. కొంతకాలం అ నంతశయనుని గుడులు, పద్మనాభస్వామి దేవాలయాలు, ఆ క్రమంలోనే రంగనాథాలయాలు నిర్మి ంచబడ్డవి. వేణుగోపాలస్వామి కూడా ఈ కాలక్రమంలో శంఖు, చక్రాలను ధరించిన విగ్రహంగా అగుపిస్తాడు. ఈ గుడుల భేదాలు తెలంగాణాలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి. వైష్ణవ మతావలంబకులలో, శ్రీవైష్ణవులలో ఏర్పడ్డ (శాఖా)భేదాలే దేవుళ్ళలో కూడా భేదరూపాలకు కారణాలైనాయి. మరొక వైపు మధ్వమతం అవలంబించిన వారివల్ల కూడా ఈ దేవాలయాలు, మూర్తులలో పలు ప్రతిమాలక్షణాలు చోటు చేసుకున్నాయి. ఈ దేవాలయాన్నీ ఇటీవల తెలంగాణ జాగృతి చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, సముద్రాల సునీల్, శ్రీరామోజు హరగోపాల్ సందర్శించిన సమయంలో దేవాలయ దర్శనానికి వచ్చివున్న వనపర్తి సంస్థానానికి చెందిన రాజా కృష్ణదేవరావుగారితో మాట్లాడినపుడు వారీ దేవాలయ చరిత్ర గురించి వివరించారు.

Special Story on Srirangapuram Ranganathaswamy Temple