Tuesday, April 16, 2024

తారక్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్

- Advertisement -
- Advertisement -

Special Surprise for NTR Fans

 

బుధవారం ఎన్టీఆర్ పుట్టినరోజు. దీని కోసం పది రోజుల ముందే తారక్ డైహార్డ్ ఫ్యాన్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ప్రారంభించేశారు. కామన్ డీపీని 25 మంది టాలీవుడ్ ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేయించి హంగామా చేశారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే నాడు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా నుంచి ‘కొమరం భీమ్’ ఫస్ట్ లుక్ మరియు ఇంట్రో వీడియో వస్తుందని.. సంబరాలను అంబరాన్ని అంటేలా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ‘కొమురం భీమ్’ పాత్రలో తారక్ ఎలా ఉంటాడో చూడాలనుకున్న ఆయన ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎలాంటి టీజర్‌ను విడుదల చేయడం లేదని ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సైతం “నా పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎటువంటి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావడం లేదనే విషయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. అభిమానుల ఆనందం కోసం ఏదో ఒకటి విడుదల చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడిందనేది నాకు తెలుసు.

అయితే అధికారిక ఆంక్షల వలన కుదరలేదు” అని ఒక లేఖ ద్వారా విన్నవించుకున్నారు. “రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది” అని తారక్ పేర్కొన్నారు. అలాగే తన బర్త్ డే నాడు ఫ్యాన్స్ అందరూ ఇంటి పట్టున ఉండాలని.. అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని సూచించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఈ తరుణంలో ఓ వ్యక్తి తాను తారక్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇస్తానని అంటున్నాడు. ఆయనెవరో కాదు తారక్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. జింబాబ్వేకి చెందిన స్టీవెన్… తారక్‌కి ఎప్పటి నుండో ఫిజికల్ ట్రైనర్‌గా ఉన్నాడు. లాయిడ్ స్టీవెన్స్ ట్వీట్ చేస్తూ “బుధవారం ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తారక్ అభిమానుల కోసం నేనొక స్పెషల్ సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తున్నాను. వేచి చూడండి” అంటూ వెల్లడించాడు.

నిరాశలో ఉన్న అభిమానులకు ఈ ట్వీట్ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. “పండగలా దిగి వచ్చావు.. మా ఫ్యాన్స్‌కి ఊపిరి అయ్యావు”, “భాష రాకపోయినా నువ్వు ఒక్కడివే మా బాధను అర్ధం చేసుకున్నావు భయ్యా” అంటూ తారక్ ఫ్యాన్స్ అతన్ని కొనియాడుతున్నారు. తారక్ బర్త్‌డే కోసం లాయిడ్ స్టీవెన్స్ ఎలాంటి సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఎన్టీఆర్ కోసం ఒక ర్యాప్ సాంగ్‌తో వస్తున్నాడు. ‘ఫలక్‌నుమా దాస్ ర్యాప్ సాంగ్’ పేరుతో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ అప్‌డేట్ లేకపోయినా ఎన్టీఆర్ అభిమానులు ఈ సర్‌ప్రైజ్ వీడియోలతో సంతోషపడనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News