Saturday, April 20, 2024

హస్తం, కమలం ఔట్

- Advertisement -
- Advertisement -

Municipal law

 

వాటివి దొంగ పొత్తులు,టిఆర్‌ఎస్‌కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి
ప్రతి హామీని అమలుపరుస్తాం
పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు
ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు
ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి కోసమే కొత్త చట్టం తెచ్చాం : కెటిఆర్

గల్లీ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బిజెపి
112 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబి జెండా
పదవుల పంపకాల్లో సామాజిక న్యాయం
క్యూఆర్ కోడ్‌తో ఇళ్లకు డిజిటల్ నంబర్లు
వార్డుల వారీగా కమిటీల ఏర్పాటు
పనిచేయని అధికారులను శాశ్వతంగా ఉద్యోగాలనుంచి పంపిస్తాం
నూతన మున్సిపాలిటీ చట్టం అమలుకు ప్రత్యేక శిక్షణ
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

హైదరాబాద్: ఢిల్లీ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్,బిజెపి చేసేవి గల్లీ పనులని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవచేశారు. టిఆర్‌ఎస్ ప్రజా బలం ముందు జాతీయ పార్టీలని చెప్పుకుంటున్న కాంగ్రెస్,బిజెపి ధరిదాపుల్లోకి రాలేక పోయాయని విమర్శించారు. ఈ పార్టీలు అనైతిక పొత్తులు పెట్టుకుని గల్లీ రాజకీయాలకు పాల్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం ఓ నాలుగు మున్సిపాలిటీలకోసం అనైతిక పొత్తులు పెట్టుకుని ఖండువాలు కప్పుకున్న కాంగ్రెస్ బిజెపిల వ్యవహారం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటివరకు టిఆర్‌ఎస్‌కు మేము పోటీ అంటూ ప్రగల్భాలు పలికిన బిజెపి, కాంగ్రెస్‌ను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమి వేశారన్నారు. టిఆర్‌ఎస్ దెబ్బకు పరస్పర విరుద్ధమైన కాంగ్రెస్,బిజెపి దొంగ పొతత్లు పెట్టుకుని కలిసిపోయాయని నిందించారు.

టిఆర్‌ఎస్‌కు సంపూర్ణమెజారిటీ ఇచ్చిన పట్టణ ఓటర్లకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రంలోని పట్టణాలను దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దనున్నట్లు చెప్పారు. సోమవారం టిఆర్‌ఎస్ కార్యాలయంలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ 120 మున్సిపాలిటీలో 112 మున్సిపాలిటీలను, తొమ్మిది కార్పొరేషన్లను అత్యధిక మెజారిటీ సాధించడం దేశంలోని ఏరాజకీయ పార్టీకైన అసాధ్యమన్నారు. అయితే టిఆర్‌ఎస్‌కు ప్రజలు అనితర సాధ్యమైన మెజారిటీ కట్టబెట్టి బాధ్యతలను పెంచారని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో టిఅర్‌ఎస్ అత్యధిక మెజారిటీ రావడంతో 10 కార్పొరేషన్లు టిఆర్‌ఎస్ గెలుచుకుందన్నారు.

పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎన్నికల్లో త్యధిక మెజారిటీ ఇచ్చి టిఆర్‌ఎస్‌ను ఓటర్లు దీవించారని కెటిఆర్ చెప్పారు. ప్రజల ఆశీస్సులతో పట్టణఆభివృద్ధిని వేగవంతం చేయనున్నట్లు చేప్పారు. పల్లెప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కెటిఆర్ ప్రకటించారు. పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే రూ. 1037 కోట్లకు సమానంగా రాష్ట్రం నిధులను మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి మొత్తం రూ. 2074 కోట్ల నిధులతో పట్టణాభివృద్ధి వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు ప్రతినెల ఖచ్చితంగా రూ. 173 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మున్సిపాలిటీ నిధుల్లో పచ్చదనానికి పదిశాతం నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించారు.

మున్సిపాలిటీల్లో జవాబుదారీ తనం
మున్సిపాలిటీల్లో జవాబుదారీ తనాన్ని తీసుకువచ్చే బాధ్యత తనపైనే ఉందని కెటిఆర్ చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ డోర్ నంబర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుందని సుమారు 43 శాతం పైగా జనాభ పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారని తెలిపారు. పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతి ఉండాలనే లక్షం తో నూతన మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. జనాభ ప్రతిపాదికన ప్రణాళిక బద్ధమైన పట్టణ ప్రగతి ఉండానే ఉద్ధేశంతో ఈచట్టం తీసుకువచ్చామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేసేందుకు నూతనంగా ఎంపికైన మేయర్లు,డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మలకు శిక్షణతరగతులను నిర్వహించనున్నట్లుతెలిపారు.

శిక్షణ కోసం అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని పౌరులను కేంద్రంగా చేసుకుని రూపొందించినట్లు తెలిపారు. వేగవంతమైన అభివృద్ధికోసం వార్డులవారిగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. ఇందులో యూత్‌కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్‌కమిటీ,రెసిడెన్షియల్ వెల్పేర్ అసోసియేషన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ ప్రకటించారు.

పౌరుల స్వయం ధ్రువీకరణ
పౌరులు స్వయం ధృవీకరణతో ఇళ్లు, పన్నులు కట్టేవిధానాన్ని అమల్లోకి తేనున్నట్లు కెటిఆర్ ప్రకటించారు. 21 రోజుల్లో ఇళ్లుకట్టుకునే అనుమతులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. పని చేయని అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలిగించే అధికారాలతోపాటు అక్రమ నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాలు నూతన మున్సిపాలిటీ చట్టానికి ఉందన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులపైకూడా వేటు వేసే అధికారాలు ఈ చట్టానికి ఉన్నాయని తెలిపారు.

వ్యాపార, వాణిజ్య సముదాయాలక స్వీయధృవీకరణ ద్వారా లైసెన్స్‌లు ఇచ్చే విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. జనన, మరణ ధృవ పత్రాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అందించే సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే లభించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయాలనే ఆలోచనతోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్న 68 మున్సిపాలిటీలను 141గా, 6 కార్పొరేషన్లను 13 కార్పొరేషన్లుగా విస్తరించిందని తెలిపారు.

సామాజిక న్యాయానికి పెద్దపీట
పురపాలిక పదవుల్లో టిఆర్‌ఎస్ సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని కెటిఆర్ ప్రకటించారు. అన్నివర్గాలకు, కులాలకు న్యాయం జరిగే విధంగా ము న్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవులు లభించాయ ని ఆయన పేర్కొన్నారు.121 టిఆర్‌ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 240 మందికి పదవులు లభించ గా ఇందులో 58 ఛైర్మన్లు, 48 డిప్యూటీ ఛైర్మన్ పదవులు బిసిలకు దక్కాయి. ఒసి క్యాటగిరిలో 38 మందికి ఛైర్మ న్ పదవులు,46 మందికి ఉపఛైర్మన్ పదవులు లభించా యి. ఎస్‌సి సామాజిక వర్గానికి 17 ఛైర్మన్ పదవులతో పాటు 9 వైస్‌ఛైర్మన్ పదవులు లభించాయి.

ఎస్‌టిలకు 5 ఛైర్మన్ పదవులు దక్కాయి. మైనారిటీలకు మూడు ఛైర్మన్ పదవులతో పాటు 14 వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయని కెటిఆర్ ప్రకటించారు. అధికారాలకు దూరంగా ఉం టున్న సఫాయి కులానికి చెందిన సోద అనితకు పరకాలలో ఛైర్మన్ పదవి దక్కిందని చెప్పా రు. అలాగే బిసిల్లో బుడగ జంగాలు, కుమ్మరి, పట్కారి, పెరిక, రజక, వడ్ల, అవుసుల కులాలకు ఛైర్మన్ పదవులు దక్కాయని, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ పదవులు ఇవ్వని కులాలకు టిఆర్‌ఎస్ పదవులు ఇచ్చి గౌరవించిందని కెటిఆర్ తెలిపారు.

అంతా చట్టప్రకారమే
ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కు తీసుకువచ్చింది గత ప్రభుత్వాలే

మున్సిపాలిటీ,కార్పొరేషన్ల ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కును వినియోగించుకోవడం హక్కు అని కెటిఆర్ చెప్పారు. అయితే ఈ హక్కును టిఆర్‌ఎస్ ప్రభు త్వం తీసుకువచ్చింది కాదని ఆయన స్ఫష్టం చేశారు. 1999లో ఆనాటి టిడిపి ప్రభుత్వం శాసనసభ్యులకు ఎక్స్‌ఆఫీషియో ఓటు హక్కును కల్పించగా 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి సభ్యులకు ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కు కల్పించిందని కెటిఆర్ వివరించారు. అలాగే పార్లమెంట్, రాజ్యసభ సభ్యులకు ఈ హక్కు గతం నుంచే ఉంది. అయితే ఉన్నచట్టాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందే కానీ కొత్తగా ప్రవేశపెట్టలేదని చెప్పారు. నిజమాబాద్ కార్పొరేషన్‌లో సహకరించిన ఎంఐఎంకు కెటిఆర్ కృజ్ఞతలు తెలిపారు. రెబల్స్‌విషయంలో కఠినంగా నే వ్యవహరిస్తామని చెప్పారు. కొల్లాపూర్‌లో రెబల్స్‌ను కాదని టిఆర్‌ఎస్ అభ్యర్థికి ఛైర్మన్‌పీఠం దక్కిందని ఆయన గుర్తు చేశారు.

Special training for new Municipal law Enforcement
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News