Thursday, April 18, 2024

సంక్రాంతి స్పెషల్

- Advertisement -
- Advertisement -

Special-Trains

నర్సాపూర్‌-సికింద్రాబాద్, లింగంపల్లి-కాకినాడ టౌన్‌ల మధ్య

హైదరాబాద్: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ నివారణకు దక్షిణ మధ్య రైల్వే నర్సాపూర్‌-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈనెల 16,17ల మధ్య నడుస్తాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ఈ నెల 16వ తేదీ ప్రత్యేక రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌లో రాత్రి 11గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6:25గంటలకు చేరుకుంటుంది.

నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ల మధ్య ఈనెల17వతేదీ ప్రత్యేక రైళ్లు నర్సాపూర్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6:05గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:10గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ నెల 12,13వ తేదీలల్లో లింగంపల్లికాకినాడ టౌన్‌ల మధ్య జన్‌సధన్ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు మూడు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. లింగంపల్లి స్టేషన్‌లో రాత్రి 8:45గంటలకు బయలుదేరి, మరుసటి రోజు కాకినాడటౌన్ ఉదయం 8:15గంటలకు చెరుకుంటుందని పేర్కొన్నారు.

Special Trains for Sankranthi 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News