Home జాతీయ వార్తలు రామ్‌లల్లాకు ప్రత్యేక దుస్తులు

రామ్‌లల్లాకు ప్రత్యేక దుస్తులు

Special velvet dress for Ram Lalla with golden thread

 

బంగారు దారంతో నవరత్నాలు పొదిగిన వస్త్రాలు
మూడున్నర దశాబ్దాలుగా స్వామి సేవలో తరిస్తున్న సోదరులు

అయోధ్య: గత మూడున్నర దశాబ్దాలుగా శంకర్‌లాల్, భగవత్‌లాల్ ‘పహాడి’ సోదరులు అయోధ్యలోని రామ్‌లల్లా కోసం వసాత్రలు కుడుతూ ఉన్నారు. ఈ నెల 5న రామమందిరంలో భూమిపూజ కార్యక్రమం కోసం స్వామివారికి కళాత్మకంగా రూపొందించిన వస్త్రాలే వారి అంకిత భావానికి అద్దంపడుతాయి. నగరంలోని బఢీ కుటియా ప్రాంతంలో తమ తండ్రిపేరుతో ఏర్పాటు చేసిన దుకాణంనుంచి కార్యకలాపాలు నిర్వహించే ఈ సోదరులు కేవలం దేవతా విగ్రహాలు, పూజారులకోసం మాత్రమే వస్త్రాలు కుడతారు.‘ మా తండ్రి దివంగత బాబూలాల్ 1985లో రామ్‌లల్లాకోసం వస్త్రాలు కుట్టడం ప్రాంభించారు. ఆయన రామజన్మభూమివద్దకు మా కుట్టు మిషన్‌ను తీసుకువెళ్లి మా అన్నదమ్ములతో కలిసి వస్త్రాలు కుట్టేవారు’ అని 54 ఏళ్ల శంకర్‌లాల్ పిటిఐకి చెప్పారు.‘ మేము ముగ్గురం కలిసి రాంలల్లాకు వస్త్రాలు కుట్టేవాళ్లం. స్వామివారి ముందే మేము వస్త్రాలు తయారు చేసే వాళ్లం. అప్పటినుంచి మా ఈ కార్యం అలా కొనసాగుతూనే ఉంది’ అని ఆయన చెప్పారు.

ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగే బుధవారం నాడు రెండు జతల వస్త్రాలు ఒకటి ఆకుపచ్చ, రెండోది ఆరెంజ్ రంగుల్లో తయారు చేసినట్లు శంకర్‌లాల్ చెప్పారు. రామ్‌లల్లా అంటే బాలుడు కాబట్టి ఈ వస్త్రాలను మెత్తగా ఉండే ‘మఖ్మల్’( వెలెట్) వస్త్రాన్ని ఉపయోగించి తయారు చేసినట్లు ఆయన చెప్పారు. బుధవారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆకుపచ్చ రంగు దుస్తులు తయారు చేస్తే ఆరెంజ్ రంగు శుభప్రదమైనదిగా భావిస్తారని ఆయన చెప్పారు. బుధవారం నాడు మొదట ఆకుపచ్చ వస్త్రాలను, త ర్వాత ఆరెంజ్ రంగు వస్త్రాలను ధరింపజేస్తారని ఆయన చెప్పారు. కాగా ఈ ప్రత్యేక దుస్తులకు బంగారు దారం ఉపయోగించి నవరత్నాలకు కూడా కుట్టినట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఈ వస్త్రాలను రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌కు వారు అందజేశారు.

స్వామివారికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరింపజేయడం సంప్రదాయంగా వస్తున్నట్లు శంకర్‌లాల్ చెప్పారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం మీగడ రంగు, శనివారం నీలపు రంగు, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలు ధరింపజేస్తారని ఆయన చెప్పారు. రాములవారి వస్త్రాలను ఏ బట్టతో తయారు చేస్తారో లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు, హనుమంతుడు, సాలిగ్రామానికి కూడా అదే బట్టను వాడతామని ఆయన చెప్పారు.

ఇంతకు ముందు ఈ వస్త్రాలను తయారు చేయడానికి 11 మీటర్ల బట్ట అవసరమయ్యేదని, ఇప్పుడు 17 మీటర్ల బట్ట అవసరమవుతోందని శంకర్‌లాల్ చెప్పారు. భవ్యమందిర నిర్మాణం జరిగిన తర్వాత విగ్రహాలకు వస్త్రాలను తయారు చేయడానికి ఎంత బట్ట అవసరమవుతుందో తెలియదని ఆయన చెప్పారు. కాగా ఇదంతా భగవంతుడి కృపేననిశంకర్‌లాల్ అన్న భగవత్‌లాల్ చెప్పారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరు ఈ వస్త్రాలు తప్ప వేరే బట్టలు కుట్టరు. చివరికి తమ బట్టలు కూడా ఇతర టైలర్ల చేతే కుట్టించుకుంటారు. అయోధ్యలో పుట్టి క్షరాముడి సేవలో తరించడంకన్నా ఇంకేమి కావాలి అని ఈ సోదరులు అనడం విశేషం. కాగా ఈ మధ్యకాలంలో ఈ సోదరులు, వారి షాపు అందరికీ ఒక ముఖ్య ఆకర్షణగా మారింది.

Special velvet dress for Ram Lalla with golden thread